YS Jagan : కూటమి విజయం సాధిస్తుందని ముందుగా పసిగట్టింది ఆయనే..
YS Jagan : ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాల గురించే చర్చ జరుగుతోంది. మొన్న, నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ప్రామాణికమైన సర్వే సంస్థలన్నీ కూటమి గెలవబోతుందని చెప్పేశాయి. అయినా కూడా సర్వేలు ఒక్కోసారి విజయవంతం కావొచ్చు..ఒక్కోసారి అట్టర్ ప్లాప్ కూడా కావొచ్చు. ఎన్నికల సంఘం ప్రకటించే ఫలితాలే అసలైనవి. ప్రస్తుతానికి కూటమి ఓడుతుందని ఎవరైతే భావించడం లేదు. కొన్ని ఫేక్ సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్పనప్పటికీ..ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టడం ఖాయమనే చర్చ సాగుతోంది.
అయతే కూటమి విజయాన్ని అందరికంటే ముందుగా పసిగట్టింది ఎవరో చెబితే షాక్ అవుతారు. కూటమి విజయాన్ని చంద్రబాబో, పవన్ కల్యాణో ముందుగా పసిగట్టారని సమాధానం రావడం కామన్. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే కచ్చితంగా గెలుస్తాయని పసిగట్టింది అక్షరాల వైసీపీ అధినేత జగనే. అందుకే ఆ పొత్తు కలవకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. అయినా పొత్తు పొడిచింది. గెలుపు ఖరారైంది.
టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు సహజంగానే ఎక్కువ మంది వ్యతిరేకించారు. అలాగే బీజేపీ, టీడీపీ పొత్తు విషయంలోనూ అలానే జరిగింది. మూడు పార్టీల కార్యకర్తల్లో ఓ రకంగా వ్యతిరేకించారు. జనసేన సీట్లు తక్కువయ్యాయని, టీడీపీ సీట్లకు కోత పడుతోందని ఇలా..రకరకాల మధ్యనే కూటమి ప్రయాణం మొదలైంది. అయితే ఆ కూటమి ఏర్పడితే తన ఓటమి ఖాయమనే భయం జగన్ లో అంతర్గతంగా పీడించింది. అందుకే పొత్తు కుదరకుండా పవన్ కల్యాణ్ ను నానా రకాలుగా రెచ్చగొట్టారు. అయినా వాటిని పవన్ పట్టించుకోకుండా తాను ఏదైతే సంకల్పించారో ఆ దిశగానే ముందుకెళ్లారు. ఇక జగన్ భంగపాటు తప్పలేదు. మూడు పార్టీలు కలిశాయి.. ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపించాయి. ప్రామాణిక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగా రేపటి ఫలితాలు ఉండబోతున్నాయని వందశాతం చెప్పవచ్చు.