Killed Brutally : మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు అన్నారో సినీకవి. మనుషుల్లో మానసిక పరివర్తన సరిగా ఉండటం లేదు. పైశాచికత్వం పెరిగిపోతోంది. రాక్షసత్వం ప్రజ్వరిల్లుతోంది. ఫలితంగా మానసిక జబ్బులతో సతమతమవుతున్నారు. మంచి అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. రాక్షసత్వం రాజ్యమేలుతోంది. ఎదుటివాడు చనిపోతుంటే సాయం చేయడానికి బదులు వీడియోలు తీస్తూ ఆనందపడేవారే ఎక్కువగా ఉంటున్నారు. మనిషిలోని మానవత్వం ఏమవుతోంది. రాక్షసత్వం పెరగడానికి కారణాలేంటి?
తాజాగా దేశరాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల బాలుడు మరో బాలుడి(17)ని విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి చంపాడు. ఏకంగా 60 సార్లు పొడిచాడంటే అతడిలో ప్రతీకారం ఎంత ఉందో అర్థమవుతుంది. కానీ అతడు చేసిన నేరమేంటో తెలిస్తే షాకే. బిర్యాణీ కోసం రూ. 350 ఇవ్వాలని కోరగా తన వద్ద లేవని అతడు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు కత్తితో పొడిచి చంపాడు.
అనంతరం అతడి జేబులో ఉన్న రూ.350 తీసుకుని డ్యాన్స్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరీ ఇంత దారుణంగా హత్య చేయడం సంచలనం కలిగించింది. రిమాండ్ కు పంపించారు. మనిషిలో ఇంతటి మానసిక పైశాచికత్వం పెరగడం దేనికి సంకేతం అని చర్చించుకుంటున్నారు. మనిషి మనిషిలా కాకుండా పశువులా ప్రవర్తిస్తున్నాడు.
దీనిపై చాలా మంది ఆలోచనలో పడిపోయారు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని కుర్రాడు మర్డర్ చేయడమేమిటి? అది కూడా పెద్ద కారణం కాదు. కేవలం రూ. 350 కోసం కత్తితో పొడిచి చంపడం సంలనం కలిగిస్తోంది. మనిషి తన మానసిక పరిపక్వత పెంచుకోవడం లేదు. జంతువుకన్నా హీనంగా చంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మనుషుల్లో మంచితనం పెరిగే సంఘటనలు మాత్రం కనిపించడం లేదు.