Star Hero Changed his Heart : పెరిగిన టెక్నాలజీ తో పాటుగా, వైద్య రంగం లో కూడా అన్నీ రకాల రోగాలకు చికిత్సలు లభిస్తున్నాయి. ఒక వయస్సు వచ్చిన తర్వాత అత్యధిక మంది గుండె నొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈమధ్య కాలం లో చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం వంటివి మనం చాలానే చూసాము. సినీ ఇండస్ట్రీ లో కూడా అలా హార్ట్ అటాక్ వచ్చి ఎంతో మంది దిగ్గజ నటులు ప్రాణాలు వదిలారు.
అలా అప్పట్లో టాలీవుడ్ లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు గారికి కూడా ఇలాంటి గుండెపోటు సమస్యలు తరచూ వస్తూ ఉండేవి. అనేక సార్లు ఆయనకీ సీరియస్ కండిషన్ కూడా ఏర్పడింది. డాక్టర్లు ఈ చికిత్స కి ఇక్కడ వైద్యం లేదు, విదేశాల్లో చేయించడం మంచిది అని చెప్తే నాగేశ్వర రావు గారిని అక్కడికి తీసుకెళ్లి వైద్యం చేయించి ఆయన ప్రాణాలను కాపాడుకున్నారు. ఆయనకి మధ్య అత్యధికంగా సేవించే అలవాటు ఉండడం వల్లే ఈ గుండెపోటు సమస్య వచ్చిందని అప్పట్లో ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉండేది.
అంతే కాదు అప్పట్లో నాగేశ్వర రావు గారికి గుండె మార్పిడి కూడా జరిగిందట. మనిషి చనిపోయిన వెంటనే కాసేపటి వరకు మన శరీర అవయవాలు పనిచేస్తుంటాయి. ఆ సమయం లోనే 10 నిమిషాల లోపు ఆర్గాన్ ని వేరే అవసరమైన మనిషికి మారిస్తే, అవి ఉపయోగపడొచ్చు అని డాక్టర్లు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నాగేశ్వర రావు గారికి అలాంటి వైద్యమే జరిగిందట. ఇది చాలా రిస్క్ తో కూడుకున్న చికిత్స. ఏమాత్రం జాప్యం జరిగిన నాగేశ్వర రావు గారి ప్రాణాలు దక్కేవి కాదు. అలాంటి రిస్క్ తో కూడుకున్న చికిత్స కోసం నాగేశ్వర రావు ఎలాంటి భయం బెరుకు లేకుండా సిద్ధం అయ్యాడు. విజయవంతంగా చికిత్స చేయించుకొని మృత్యువుని జయించి బయటకి వచ్చాడు.
సుమారుగా 90 ఏళ్ళ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించి, తన చివరి శ్వాస వరకు సినిమాకే అనికితం చేసాడు. ఆయన వెండితెర మీద చివరిసారిగా కనిపించిన చిత్రం ‘మనం’. ఈ సినిమాలో తన కొడుకు మరియు ఇద్దరు మనవళ్లతో కలిసి నటించాడు. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విడుదలకు ముందే అక్కినేని నాగేశ్వర రావు గారు చనిపోవడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్తున్నా సమయం లో నాగేశ్వర రావు గారు బెడ్ మీద నుండే చెప్పాడట. ఇంత డెడికేషన్ ఉన్న నటుడు ఇండియా లోనే ఎక్కడ ఉండదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.