Telangana Congress : కాంగ్రెస్ పార్టీకి ఆయనొక్కడే..

Telangana Congress
Telangana Congress : కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్కడు. విజయం శాయిశక్తులా పాటుపడుతున్నాడు. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కాలుకు రికాం లేకుండా తిరుగుతున్నాడు. ఓ వైపు సీనియర్లు సహకరించకపోయినా తానొక్కడే తిరుగుతూ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు.
సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు, డిబేట్లు ఏవైనా ఒక్కడే వెళ్లి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నాడు. అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తున్నాడు. సోనియా, రాహుల్ గాంధీల సభల్లో మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, మధుయాష్కీ, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ లాంటి నేతలు కనిపిస్తున్నారు. ఇక అభ్యర్థుల ప్రచారాల్లో రేవంత్ రెడ్డి ఒక్కడే తిరుగుతూ హోరెత్తిస్తున్నాడు.

Revanth Reddy
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతుగా పోరాటం చేస్తున్నారు. తానొక్కడే నిలుస్తూ పార్టీని నలుదిశలా వ్యాపింపచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ ఆయన చేతి చలవే. రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటిస్తూ అభ్యర్థులకు అభయం ఇస్తున్నాడు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వారిలో భరోసా నింపుతున్నాడు.
ప్రభంజనంలా పార్టీని విస్తరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా అధిష్టానం కూడా రేవంత్ కు మద్దతుగానే నిలిచింది. దీంతో ప్రచారంలో దూసుకుపోతున్నాడు. కేసీఆర్ ను విమర్శించడంలో కూడా ముందుంటాడు. అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.