HanuMan Villain Role : చిన్న సినిమా ముందు పెద్ద సినిమాలు బోల్తా కొట్టడం కొత్తేమి కాదు, ప్రతీ ఏడాది ఇది మనం చూస్తూనే ఉన్నాం. కానీ స్టార్ హీరోల సినిమాలను మొదటి రోజు నుండే డామినేట్ చేస్తూ వచ్చిన మొట్టమొదటి సినిమా మాత్రం ‘హనుమాన్’ అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. భారీ అంచనాల నడుమ ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఇటు తెలుగు తో పాటు అటు హిందీ బాక్స్ ఆఫీస్ ని కూడా రఫ్ఫాడించేస్తుంది.
కేవలం 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో 500 కోట్ల రూపాయిల బడ్జెట్ సినిమాని చూసిన అనుభూతిని రప్పించిన ప్రశాంత్ వర్మ కి సెల్యూట్ చేస్తున్నారు సినీ మేధావులు. ఒకప్పుడు ఇతను స్క్రిప్ట్స్ పెట్టుకొని స్టార్ హీరోల ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. కానీ ఒక్కరు కూడా ఆయనకి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు హనుమాన్ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తో స్టార్ హీరోలందరూ అతనితో సినిమాలు చెయ్యడని అమితాసక్తిని చూపిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ‘హనుమాన్’ చిత్రం లో విలన్ గా వినయ్ రాయ్ నటించిన సంగతి తెలిసిందే. వినయ్ రాయ్ అంటే మీ అందరికీ వెంటనే గుర్తుకురాకపోవచ్చు. కానీ అతనెవరో కాదు, ‘వాన’ సినిమాలో హీరో. మన చిన్నతనం లో ఉన్నప్పుడు ఈ సినిమా పాటలు ఎన్ని వందలసార్లు విని ఉంటామో లెక్కే లేదు. అలాంటి మ్యూజికల్ హిట్ చిత్రం లో నటించిన ఈయన, ఆ తర్వాత పలు సినిమాల్లో హీరో గా చేసాడు కానీ, కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీంతో ఆయనకీ హీరో అవకాశాలు దూరం అయ్యాయి. వరుసగా విలన్ రోల్స్ చేసే అవకాశం దక్కింది. ఆ రోల్స్ తోనే ఫేమస్ అయిన ఈయన హనుమాన్ చిత్రం లో కూడా నటించాడు. అయితే ఈ సినిమాలో విలన్ గా ఇతనికంటే ముందుగా మరో తమిళ హీరోని సంప్రదించారట.
అతను మరెవరో కాదు, హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ములేపుతున్న విజయ్ సేతుపతి. కథ సిద్ధం చేసుకోవడమే ఆ క్యారక్టర్ ని విజయ్ సేతుపతి ని ఊహించుకుంటూ చేసాడట డైరెక్టర్. కానీ విజయ్ సేతుపతి డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో వినయ్ రాయ్ ని ఆ పాత్ర కోసం తీసుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఒకవేళ ఈ సినిమాని విజయ్ సేతుపతి ఒప్పుకొని చేసి ఉంటే తమిళ మార్కెట్ కూడా బాగా కలిసొచ్చేది.