Warangal MP Candidate : పదేళ్లు పాలించిన పార్టీకి ఏం గతి పట్టింది. అందుకే అంటారు.. ‘ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయని’ ఎక్కడ ఉన్నా మనిషి శాంతంగా ఉంటే కీర్తి ప్రతిష్టలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. కాదని పెచ్చుమీరితే అధోగతి పాలవ్వాల్సిందే. ఇది బీఆర్ఎస్ పార్టీకి బాగా సూట్ అవుతుందేమో.
అధికారం చేతిలో ఉన్నప్పుడు నాయకులను, కార్యకర్తలను చిన్న చూపు చూశారు నేతలు. దీంతో చాలా మంది పార్టీని వీడి బటయకు వెళ్లారు. దళితులు అని చూడకుండా అవమానించారు. గత్యంతర లేక కొందరు అందులోనే ఉంటే.. కొందరు మాత్రం బయటకు వెళ్లిపోయారు. అవమానంతో బయటకు వెళ్లిన నేతల్లో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒకరు. మంత్రిగా ఉన్న రాజయ్యను ఒక్కసారిగా పదవి నుంచి తొలగించి అవమానించారు. దీంతో కొంత కాలం కొనసాగిన తర్వాత పార్టీకి రాజీనామా చేశాడు. ఈ నేతనే ఇప్పుడు కేసీఆర్ కు అక్కరకు వస్తున్నాడు.
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కూతురు కావ్య పేరును బీఆర్ఎస్ ప్రకటించింది. కానీ పార్టీ పతనం చూస్తున్న ఆమె ఓడిపోతానని భావించి పోటీ నుంచి తప్పుకోవడంతో పాటు పార్టీకి రాజీనామా చేసింది. ఇక కడియం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో అక్కడ బీఆర్ఎస్ కు అభ్యర్థి కరువయ్యారు. ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్య పేరు కేసీఆర్ కు గుర్తుకు వచ్చింది.
బీఆర్ఎస్ మాజీ లీడర్, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కేసీఆర్ ఈ రోజు (ఏప్రిల్ 12) పిలుపువచ్చింది. దీంతో రాజయ్య ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌కు బయలుదేరారు. కేసీఆర్ తో రాజయ్య భేటీ అనంతరం వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని కడియంకు టికెట్ కేటాయించారు కేసీఆర్. దీంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్న రాజయ్య ఇటీవల పార్టీకి రాజీనామా కూడా చేశారు. ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరకపోవడంతో వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.