JAISW News Telugu

Director Krishnavamshi : ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్.. అతనితో సినిమా కష్టమే : డైరెక్టర్  కృష్ణవంశీ కామెంట్స్

FacebookXLinkedinWhatsapp
Director Krishnavamshi

Director Krishnavamshi

Director Krishnavamshi : తెలుగు హీరోలు ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలేస్తున్నారు. నార్త్ పై సౌత్ హీరోల డామినేషన్ మొదలైంది. కరోనా అనంతరం  బాలీవుడ్ హీరోల సినిమాలు పెద్దగా హిట్టయినవి కూడా ఏమీలేవు. చాలా ఏళ్ల తర్వాత షారూఖ్ ఖాన్ కు పఠాన్, జవాన్ సినిమాలు సక్సెస్ అయినా ఆ తర్వాత వచ్చిన డాంకీ సినిమా యావరేజ్ గా నిలిచింది.

ఇక తెలుగు హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్  బాలీవుడ్ హీరోలతో పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్ లో చెలరేగిపోతున్నాడు. కల్కి తో బాలీవుడ్ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఇక  జూనియర్ ఎన్టీఆర్ వార్-2లో హృతిక్ రోషన్ తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ రాబోయే సినిమాలు సైతం పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుబోతున్నాయి. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం రాజమౌళితో కలిసి ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించబోతున్నారు. అయితే రాజమౌళి గత చిత్రాలకన్నా ఈ సినిమా మరింత  హై స్టాండర్డ్ తో నిర్మించబోతున్నారని టాక్. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండబోతున్నట్లు సమాచారం.

ఇక టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొన్నేళ్లుగా సక్సెస్ లేక తంటాలు పడుతున్నాడు. ఈ సీనియర్ డైరెక్టర్ టాలీవుడ్ హీరోల అభిమానులతో ముచ్చటించారు. అది కూడా తన సినిమాల్లో చేసిన హీరోలపైనే కామెంట్లు చేశారు.  రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు  సినిమా చేస్తున్నారని అడుగగా, అతని కోసం అదిరిపోయే కాన్సెప్ట్ సిద్ధం చేశానని, చరణ్ ఓకే చెప్తే ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్నారు. ఇక తన  సినిమాలో చేసిన మరో హీరో మహేష్ బాబుపైనా కామెంట్స్ చేశాడు.మహేష్ బాబు ఇంటర్నేషనల్ స్టార్ అని అతనితో సినిమా చేయడం ఇక కష్టమేనని చెప్పుకొచ్చాడు. ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయని మహేష్ బాబుపై కృష్ణవంశీ చేసిన వ్యాఖ్యలు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.  ఏ కోణంలో ఆ డైరెక్టర్ ఈ వ్యాఖ్యలు చేశాని ఆరా తీస్తున్నారు..

Exit mobile version