Invited World Cup Final : ప్రపంచకప్ ఫైనల్ కు తనకు ఆహ్వానం లేదు! సంచలన విషయాలు చెప్పిన కపిల్ దేవ్
Not invited World Cup Final : క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అత్యంత హోరీ హోరీగా జరిగిన ఈ మ్యాచ్ భారత్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. చివరి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని భారత జట్టు ఫైనల్ లో ఓడిపోయిన కప్పును పోగొట్టుకుంది.
అయితే ఈ మ్యాచ్ కు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కు ఆహ్వానం అందలేదట. అహ్మదాబాద్ లో ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ కు తనను ఆహ్వానించలేదని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వెల్లడించాడు. 1983లో భారత జట్టుకు చారిత్రాత్మక తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్ అందించిన కపిల్ తన మాజీ సహచరులతో కలిసి మ్యాచ్ కు హాజరు కావాలనే కోరికను వ్యక్తం చేశాడు.
‘నన్ను ఫైనల్ కు పిలవలేదు. కాబట్టి నేను వెళ్లేదు, అంత సింపుల్. ‘83’ జట్టు మొత్తం నాతో ఉండాలని నేను కోరుకున్నాను. కానీ ఇది చాలా పెద్ద కార్యక్రమం. ప్రజలు బాధ్యతలను నిర్వహించడంలో చాలా బిజీగా ఉండడం వల్ల, కొన్నిసార్లు వారు మర్చిపోతారు’ అని కపిల్ మీడియాకు చెప్పారు. కపిల్ దేవ్ 1983 లో బలమైన వెస్టిండీస్ జట్టును చిరస్మరణీయమైన తక్కువ స్కోరు మ్యాచ్ లో ఓడించి జట్టును మొదటి ప్రపంచ కప్ విజయానికి నడిపించడం ద్వారా భారత క్రికెట్ చరిత్రలో కీలక పాత్ర పోషించాడు.
భారత క్రికెట్ కు కపిల్ దేవ్ గణనీయమైన సేవలందించినప్పటికీ, కపిల్ దేవ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం ప్రతిష్ఠాత్మక మ్యాచ్ లో లెజెండరీ కెప్టెన్ ను చూడాలని ఆశించిన అభిమానులను నిరాశపరిచింది.