Medico incident : కోల్‌కతాలో మెడికో హత్య, అత్యాచారం కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు సీబీఐ మానసిక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో సంజయ్‌ను సీబీఐ చాలా ప్రశ్నలు అడిగింది. అతని మొబైల్ ఫోన్ లో దొరికిన పోర్న్ వీడియోలకు సంబంధించి కూడా ప్రశ్నలు తలెత్తాయి. తాను రెడ్ లైట్ ఏరియాకు వెళ్లేవాడినని సంజయ్ రాయ్ విచారణలో వెల్లడించాడు. ఘటన జరిగిన రోజు తాను పోర్న్ వీడియోలు చూసినట్లు సీబీఐ వివరించారు. నిందితుడికి హైపర్ సెక్సువాలిటీ అనే సమస్య ఉందని వైద్య నిపుణులు గుర్తించారు.
ఇది ఒక రుగ్మత అని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరులో లోపాల వల్ల ఈ రుగ్మత సంభవిస్తుందని చెబుతున్నారు. ఈ రుగ్మతకు లోనైన వ్యక్తికి లైంగిక కోరికలపై నియంత్రణ ఉండదు. దీని కారణంగా, వ్యక్తి పదే పదే క్రూరమైన ఆలోచనలు చేస్తుంటాడ. తన లైంగిక కోరికలను తీర్చుకునేందుకు వెంపర్లాడుతుంటాడు. తన లైంగిక కోరిక నెరవేరకపోతే, మానసికంగా క్రూరంగా మారిపోతుంటాడు. మెడికో ఘటనలోనూ ఇదే జరిగిందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
కాళ రాత్రి.. కల చెదిరిన రాత్రి
ఈ సందర్భంగా మెడికో తల్లిదండ్రులు తమ కుమార్తె గురించి తలుచుకుంటూ విలపిస్తున్నారు. పీజీలో గోల్డ్‌మెడల్ సాధించాలనే లక్ష్యంతో.. రాత్రీపగలు అనే తేడా లేకుండా కష్టపడి చదువుకుంటుందని విలపించారు. చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదని గుర్తు చేసుకుంటున్నారు. తను ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి సైతం నిశ్చయమైందని, నవంబర్‌లో వివాహం జరిపించాలనుకున్నామని ఆమె తల్లిదండ్రులు వెల్లడించారు. ఎంబీబీస్ కోచింగ్ సెంటర్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో ఉందన్నారు. వారిద్దరూ తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి.. తల్లిదండ్రులను కూడా ఒప్పించారు. ఈ నవంబర్‌లో వివాహం చేసుకోవాలనుకున్నారు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ ఒక్క కాళ రాత్రి వారి కలలను చిద్ర చేసింది. తమ బిడ్డ కలలను కల్లోలం చేసిందని తల్లిదండ్రులు వాపోయారు. చనిపోయే ముందు రోజు ఆమెకు కాబోయే భర్తతో ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇక అదే రాత్రి ఆ ఇద్దరి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. వారి అందమైన కలలను కనుమరుగు చేసింది. ఆగస్ట్ 9న మెడికోకు ఆ అబ్బాయి ఫోన్ చేయగా స్పందించలేదు. పని ఒత్తిడిలో ఉందేమోనని భావించి.. డిస్టర్బ్ చేయొద్దని మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత ఈ ఘోరం గురించి అతనికి తెలిసింది.