Jeethu Joseph Special Style : సినిమాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు కమర్షియల్ గా తీస్తే మరికొందరు హాస్యాభరితంగా సినిమాలు తీస్తుంటారు. ఇందులో ఎవరి పంథా వారిది. ప్రేక్షకుడిని రెండున్నర గంటలు కుర్చీలో కూర్చోబెట్టే సత్తా దర్శకుడికే ఉంటుంది. ప్రతిభ గల దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ వారి రంగం మాత్రం ఆసక్తి కరంగా ఉంటుంది. ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ప్రతి ఒక్కరిది ఒక్కో విధంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో జన్మించిన జీతూ జోసెఫ్ ది కూడా ప్రత్యేక స్టైల్. తన సినిమా ప్రవేశమే ఓ విచిత్రంగా జరిగింది. తన భార్యకు ఇష్టంలేని సినిమాకు వెళ్లలేనని మాట ఇచ్చి ఆమె ప్రోద్బలంతోనే మళ్లీ సినిమాల్లోకి వచ్చి రాణించి దాదాపు 17 సినిమాలు తీస్తే అందులో మూడే ప్లాప్ లు మిగతావన్ని హిట్లే. ఈనేపథ్యంలో ఆయన స్టైల్ చూస్తే ముచ్చటేస్తుంది.
తన మొదటి సినిమా డిటెక్టివ్ కథను సురేష్ గోపికి చెప్పి ఒప్పించాడు. కానీ నిర్మాత దొరక్కపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు తన ఆస్తినంతా అమ్మేసి తానే నిర్మించి హిట్ కొట్టాడు. తరువాత కేరళలో జరిగిన ఓ హత్య కేసును సినిమాగా రాసుకున్నాడు. అదే ద్రుశ్యం సినిమా. ఇందులో మోహన్ లాల్ హీరో. తెలుగులో వెంకటేశ్, మీనా నటించారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా మిగిలింది.
ఇప్పటి వరకు 17 సినిమాలు చేస్తే అందులో మూడే ప్లాప్ లు. మిగతావన్ని హిట్లే. రూ. 12 కోట్లతో సినిమా చేస్తే రూ. 85 కోట్లు రాబట్టాడు. ఇది ఆల్ టైం రికార్డు. ప్రస్తుతం మోహన్ లాల్ కథానాయకుడిగా రామ్ అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా తీయనున్నారు. ఈ ఏడాదిలో మొదటి భాగం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మోహన్ లాల్ పోలీసు అధికారిగా కనిపించనున్నాడని అంటున్నారు.