Facebook and Google : ఎలాంటి వస్తువులు అమ్మకుండానే ఫేస్ బుక్, గూగుల్ నుంచి కోట్లు కొట్టేశాడు

Facebook and Google

Facebook and Google

Facebook and Google : ప్రపంచంలోని రెండు అతిపెద్ద కంపెనీలైన గూగుల్, ఫేస్‌బుక్ నుండి ఒక వ్యక్తి  ఒక బిలియన్ రూపాయలకు పైగా దోచుకున్నాడు. లాట్వియాకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్, గూగుల్‌లను 122 మిలియన్ డాలర్లు మేర మోసం చేశాడు.  లాట్వియా నివాసి అవ్లాదాస్ అనే వ్యక్తి గూగుల్ నుంచి 23మిలియన్ డాలర్లు, ఫేస్ బుక్ నుంచి 99మిలియన్ డాలర్లు తీసుకున్నాడు. ఈ వ్యక్తి ఫేస్‌బుక్, గూగుల్ నుంచి మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్లు నివేదికలో పేర్కొంది. 2013 నుంచి 2015 మధ్యకాలంలో ఈ మోసం జరిగిందని, ఈ రెండు కంపెనీలు సరుకులు కొనుగోలు చేశామనే మాయంలో..  వస్తువులు కొనుగోలు చేయకుండానే డబ్బులు ఇచ్చాయి.

లాట్వియాకు చెందిన ఈ వ్యక్తి తైవాన్‌కు చెందిన హార్డ్‌వేర్ తయారీదారు క్వాంటా కంప్యూటర్‌ సిబ్బందిగా నటించాడు. లాట్వియాలో అదే పేరుతో కంపెనీని నమోదు చేశాడు. దీని తర్వాత అది ఎప్పుడూ విక్రయించని వస్తువుల కోసం గూగుల్, ఫేస్ బుక్ లకు  ఇన్‌వాయిస్‌లను పంపాడు. ఈ నకిలీ ఇన్‌వాయిస్‌తో పాటు, రెండు కంపెనీల అధికారుల సంతకాలతో కూడిన ఒప్పందం , లేఖ కూడా జతచేశాడు. ఇది కాకుండా, అతను గూగుల్,ఫేస్‌బుక్ అధికారులు పంపిన నకిలీ ఇమెయిల్ అంటే స్పూఫ్డ్ ఇమెయిల్‌ను కూడా జత చేశాడు.

డబ్బును బదిలీ చేయడానికి గూగుల్, ఫేస్ బుక్ వైర్ ట్రాన్స్‌ఫర్‌ని ఉపయోగించాయి. ఇందులోభాగంగా, ఈ ఇన్‌వాయిస్‌లు నకిలీవని, ఎలాంటి ఒప్పందం లేదని రెండు కంపెనీలు తనిఖీ చేయలేదు. విషయం ఇక్కడితో ముగియలేదు. రెండు కంపెనీల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్న ఈ వ్యక్తి యూరప్, లాట్వియా, లిథువేనియా, సైప్రస్, స్లోవేకియా, హంగేరీలతో కూడిన ఐదు దేశాల్లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడు.  దీని తరువాత, అతను దొంగిలించబడిన మొత్తంలో 50 మిలియన్ డాలర్లను తిరిగి ఇవ్వడానికి అంగీకరించాడు. అయితే, మిగిలిన 72 మిలియన్ డాలర్లు ఏమయ్యాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

TAGS