Crime News : మరో మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నా నేరమే

Crime News

Crime News

Crime News : పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పేరుగాంచిన భారతదేశంలో నేడు మహిళలకు భద్రత కరువైంది. మహిళలను దేవుళ్లలా చూసుకునే దేశంలో వారిపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు, హింసలు నిత్యకృత్యమవుతున్నాయి. పోలీసులు ఉన్నారు.. చట్టాలున్నాయి. కానీ నేరాలు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా సంచరిస్తేనే నిజమైన స్వాతంత్య్రం అని మహాత్మా గాంధీ  అన్నారు. ఆయన అన్నట్లు అర్ధరాత్రి కాదు పట్టపగలే మహిళలు తిరిగే పరిస్థితి లేదు. ఇంటి నుంచి వెళ్లిన ఆడపిల్ల/స్త్రీ క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. దారిలో ప్రమాదాలు పొంచి ఉన్నారు. నిర్భయ చట్టం తర్వాత కూడా రోజు అత్యాచార ఘటనలు ఆగడం లేదు.

గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, ఆఫీసుల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం ఇలా.. మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు హామీ లేదు. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, నిర్భయ వంటి ఘటనలు నేపథ్యంలో దేశంలో మహిళల భద్రతకు కొత్త చట్టాలు తీసుకురానున్నారు. ఇవి జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.  మహిళల హక్కులు, వారి గౌరవాన్ని పరిరక్షించడానికి కొత్త క్రిమినల్ చట్టాలలో కఠినమైన నిబంధనలు చేర్చినట్లు పీఐబీ పేర్కొంది. ఇకపై తప్పుడు వాగ్దానాలతో మహిళను లోబరుచుకొని ఆమెతో లైంగిక సంబంధాలను పెట్టుకోవడం కూడా నేరం. దోషులకు కఠిన శిక్షలు తప్పవని వెల్లడించింది.  ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు.

TAGS