viral video : మేఘాలకు చిల్లుపడడం చూశారా? ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.. వీడియో వైరల్

viral video : సాధారణంగా సముద్రాల్లో సునామీలు, అగ్ని పర్వతాల్లో విస్పోటనాలు సంభవిస్తుంటాయి. ఆకాశంలోని మేఘాల్లో కూడా ఇలాంటి విస్పోటనాలు సంభవిస్తే ఎలా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడప్పుడు ఇలా సంభవిస్తాయని అంటున్నారు. ఇలాంటి దృశ్యాలను కొందరు ఫొటో గ్రాఫర్లు వీడియో రూపంలో, ఫొటోల రూపంలో బంధిస్తుంటారు. ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. మేఘాల్లో సునామీ వచ్చిందా.. అనిపించేలా ఒక్క సారిగా మేఘాలు నీటిని భూమిపైకి పంపించాయి. ఇది చూస్తే ఆకాశానికి చిల్లు పడిందా? అన్న అనుమానం కలుగకమానదు.

ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోనే మంచి ఉదాహరణ. @CosmicGaiaX అనే యూజర్ నేమ్‌ తో ‘ఎక్స్‌’ లో ఈ వీడియోను షేర్ చేశారు. 12 సెకన్ల టైమ్‌లాప్స్ క్లిప్. ఇందులో అందమైన పర్వత ప్రాంతం ఉంటుంది. ఆ పర్వతాల కింద ఒక సరస్సు ఉంది. ఆకాశంలో బ్లాక్, బ్లూయిష్ గ్రే కలర్ క్లౌడ్స్ కనిపించాయి. అవి ముందుకు కదులుతుంటే భారీ వర్షం ప్రారంభమవుతుంది.

సునామీలా వర్షం
వర్షం ఎలా పడుతుంది. ఒక్కొక్క చినుకుతో ప్రారంభం అవుతుంది. జడివాన అయితే అవే చినుకులు పెద్దగా ఉంటాయి. కానీ నీళ్లు ఒక్కసారిగా కుమ్మరించినట్లు ఉండదు. సముద్రంలో అలలు పోటెత్తినట్లు ఆకాశం నుంచి కిందికి పడుతుంది. అలా దిగివచ్చిన నీరు సరస్సును తాకుతుంది. ఈ సీన్ చాలా అందంగా కనిపించింది. కానీ ఇలాంటి ప్రాంతాల నుంచి దూరంగా ఉండడం మంచిదట. ఈ వీడియోకు ‘సునామీ ఫ్రమ్‌ హెవెన్’ అనే క్యాప్షన్ యాడ్ చేశారు.

ఈ వీడియో ఆస్ట్రియా (Austria) లోని లేక్ మిల్‌స్టాట్ సమీపంలో చిత్రీకరించారు. దీన్ని పీటర్ అనే మైయర్ రికార్డు చేశాడు. గాలి ఒత్తిడిలో హఠాత్తుగా మార్పు రావడం వల్ల నీరు ఇలా ఒక్కసారిగా కిందికి జాలు వారచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక బలమైన తుఫాన్ వచ్చే ముందు మేఘాలు వేగంగా కదులుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని కొందరు అభిప్రాయపడ్డారు. నిపుణులు ఎవరూ దీనిపై ఇంకా రెస్పాండ్ కాలేదు.

నెటిజన్ల రియాక్షన్..
కామెంట్ల సెక్షన్‌లో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ‘వెనిజులాలో, ఇలాంటి వర్షం 10 లేదా 15 నిమిషాలు పడుతుంది, ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది.’ అని ఒక యూజర్ రాశాడు. ‘ప్రకృతి అనేది అద్భుతమైన శక్తి. గొప్ప పోస్ట్’ అని మరొకరు వీడియోను చిత్రీకరించిన వారిని ప్రశంసించారు. ‘అలాంటి వర్షంలో చిక్కుకోవాలని నేను అనుకోను.. వావ్.’ అని ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘అది అందంగా ఉంది!’ అని మిగతావారు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు 153,000కు పైగా వ్యూస్, 3000 దాకా లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్యలు ఇంకా పెరుగుతూనే ఉంది.

 

2022లోనూ వైరల్..
2022లో ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీటి మధ్య ఒక్కటే తేడా. ఆ వీడియోలో పర్వత ప్రాంతంలో బదులుగా, ఒక రద్దీగా నగరంపై కుండపోత వర్షం కురుస్తుంది. రెడిట్‌లో పంచుకున్న ఈ వీడియోలో చీకటి మేఘాలు నగరంపై భారీ వర్షాన్ని కురిపింస్తుంది.

TAGS