Pawan Kalyan second daughter : పవన్ కళ్యాణ్ రెండో కూతురిని చూశారా ఎంత ముద్దుగా ఉందో

Pawan Kalyan second daughter
Pawan Kalyan second daughter : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చారు. కాగా ఈసారి పవన్ కళ్యాణ్ స్పెషల్ గా కనిపించారు. కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు తన కూతురు ఆద్య తో కనిపించేవారు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య అని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అన్నా లిజనోవా సంతానం పలిన కూడా పవన్ కళ్యాణ్ వెంట కనిపించింది.
పలిన క్రిస్టియన్ కావడంతో తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ చేస్తూ సంతకం చేయాల్సి వచ్చింది. క్రిస్టియన్ అండ్ మైనర్ బాలిక కావడంతో తిరుమలలో ఉన్న రూల్స్ ప్రకారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్ పామ్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. దీనిని అనుసరించి పవన్ కళ్యాణ్ ముందుగా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా తన రెండో కూతురు తో శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా పలినాన్ని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రెండో బిడ్డని చూడడంతో పట్టలేని ఆనందంతో అన్న కూతురు అంటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ తిరుమలలో అలిపిరి మార్గంలో దర్శించుకునేందుకు వెళ్లే సమయంలో స్పృహ తప్పి పడిపోయారు. అంతేకాకుండా నడుము నొప్పి కాలు నొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డారు. కాగా ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తిరుమలలో లడ్డు వివాదంలో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుర్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. కాగా అక్కడ తన కూతురు క్రిస్టియన్ కావడంతో డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేయాల్సి వచ్చింది. దీనికి ఆయన ఇలాంటి మొహమాటం లేకుండా తన కూతురు గురించి డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.