Prasidh Krishna : టీ20ల్లో మన ప్లేయర్ చెత్త రికార్డు చూశారా?
Prasidh Krishna : వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ బోల్తా కొట్టింది. అన్ని మ్యాచ్ ల్లో విజయాలు నమోదు చేస్తూ చివరకు చేతులెత్తేయడం మనవారికి అలవాటే. టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా ప్రసిద్ధ్ క్రిస్ణ చెత్త రికార్డు నమోదు చేశాడు. అత్యధిక పరుగులు ఇచ్చుకుని మన పరువు తీశాడు. ఇప్పుడు బౌలర్ గా తన చెత్త గా బౌల్ చేసి ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు.
నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో ఏకంగా 68 పరుగులు ఇచ్చాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎస్కే అబాట్ తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచారు. కసున్ రజిత (శ్రీలంక) 75 పరుగులు, క్రిస్ సోలె (స్కాట్లాండ్) 72 పరుగులు, టురన్ (టర్కీ) 70 రన్స్, బారీ మెక్ కార్తి (ఐర్లండ్ ) 69 పరుగులతో తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు.
మన ఆటగాడు ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఇలా చెత్త రికార్డు నెలకొల్పిన బౌలర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇంత దారుణంగా ఆడటం అతడికే చెల్లింది. అన్ని పరుగులు ఇవ్వడం అతడి చేతగాని తనానికి నిదర్శనం. ఇలా ఇస్తే భవిష్యత్ లో ఓటములే ఎదురవుతాయి. ప్రత్యర్థులను కట్టడి చేయాల్సిన బౌలర్ ఇలా పరుగులు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.
మనవారి ఆటతీరు తెలిసిందే. కానీ ఇంత దారుణంగా పరుగులు సమర్పించుకోవడంతో మన పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. అనవసరంగా వారికి అన్ని పరుగులు ఇవ్వడంతో మనవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో ప్రేక్షకులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇంత హీనంగా బౌలింగ్ చేయడంతో తిట్టుకుంటున్నారు.