Viral Video : రోడ్డుపై వెళ్తుంటే మీకు ఘోర ప్రమాదం జరిగిందా? మీ వాళ్లకు తెలియాలంటే ఇలా చేయండి..

Viral Video

Viral Video

Viral Video : ప్రస్తుతం మన లైఫ్ బిజీబిజీగా అయిపోయింది. ఉరుకులు పరుగులు జీవితం అనుభవిస్తున్నారు ప్రతీ ఒక్కరూ. ఈ పోటీ రంగంలో ముందుండాలని వేగంగా దూసుకెళ్తున్నాం. ఈక్రమంలో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియడం లేదు. అలాగే ఎటైనా వెళ్తున్నప్పుడు మితిమీరిన వేగంతో రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోతున్నాయి. మనం ఇతరులను ఢీకొట్టడమా..మనల్ని ఇతరులు ఢీకొట్టడమా..ఇలా ప్రమాదం ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు.

నేటి కాలంలో ఇంట్లో తక్కువగా రోడ్లపై ఎక్కువగా గడుపుతున్నాం. జీవన పోరులో ఒంటరి యాత్ర చేస్తున్నాం. ఈనేపథ్యంలో రోడ్డుపై హఠాత్తుగా కళ్లుతిరిగి పడిపోవడమో,  లేదా గుండెపోటు సంభవించడమో లేదా రోడ్డు ప్రమాదం జరుగడమో లేదా ఏ ఇతర విపత్తో సంభవించవచ్చు. మనం కోమాలోకి వెళ్లడమో, తీవ్రంగా గాయపడి ఉండడం జరుగొచ్చు.  అలాంటప్పుడు మన పక్కన ఉండేవాళ్లు 108 కు ఫోన్ చేయడం లాంటిది చేస్తారు కానీ మన ఇంటికి ఫోన్ చేయలేరు. మన ఫోన్ చేద్దామంటే లాక్ వేసి ఉంటుంది. అలాంటప్పుడు మన ఇంటికి సమాచారం అందదు. ఏదైనా సీరియస్  అయితే మన పరిస్థితి ఏంటి?

అందుకే మన ప్రమాదం గురించి మన వాళ్లకు తెలిసేలా.. మన ఫోన్ మనకు ఉపయోగపడుతుంది. అందరికీ అత్యంత ప్రయోజనమైన విషయం ఇది.. అదేంటో ఒకసారి చూద్దాం..

మొబైల్ లో ఉన్న సెట్టింగ్ ఓపెన్ చేయాలి. సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ లోకి వెళ్లి అందులో మీ మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, వైఫ్, హాస్బండ్ ఇలా మీ వాళ్ల నంబర్ ను యాడ్ చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ లో మన మొబైల్ లాక్ లో ఉన్నా.. అన్ లాక్ చేస్తుంటే ఎమర్జెన్సీ కాల్ ఆప్షన్ వస్తుంటుంది. దానికి కాల్ చేస్తే మనం సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీలో  ఫీడ్ చేసిన నంబర్ కు ఫోన్ వెళ్తుంది.

ఇలా చేయడం వల్ల మనం ఏ ప్రమాదానికి గురైన మనవాళ్లకు సమాచారం అందుతుంది. ఈ విలువైన సమాచారాన్ని ప్రతీ ఒక్కరికి తెలియజేయండి. తోటివారి ప్రాణాలను కాపాడండి.

TAGS