Prajapalana Application Status : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో భాగంగా గ్యారెంటీ ల కోసం గ్రామ సభలో ప్రజలు పెద్ద ఎత్తున అర్జీలు సమర్పించారు. అయితే తమ అప్లికేషన్ అప్రూ వయిందా లేక రిజెక్ట్ అయిందా? అనేది తెలుసుకో వడం ఎలా అన్న సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. అలాంటి వారి కోసమే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించనున్నారు. ఇందులో మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ దరఖాస్తు స్టేటస్ చూసుకోవచ్చని తెలిపారు.
మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అద్భుతంగా సాగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వాలు చాలా అరుదుగా ఉంటాయని అలాంటి ప్రభుత్వాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలకు ఉన్న కష్టాలను వారి సమస్యలను తీర్చినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం వస్తుంది అలా నమ్మకం కలిగించే దిశలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముందుకు సాగుతుంది.
అప్లికేషన్ పెట్టుకున్నాక ఎప్పుడు పథకాలు వస్తాయో రావో అన్న భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న రాజకీయ నేతల ఒత్తిడితో మాకు ఆ స్క్రీన్ వర్తిస్తుందా లేదా అని భయంతో ఉంటారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కల్పించడం లేదు ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ను జల కోసం కేటాయించింది. ఇచ్చిన ఫిర్యాదు లేదా అర్జీ ఏ స్థితిలో ఉంది అని కనుక్కోవడానికి ఒక వెబ్ సైట్ కూడా ప్రవేశపెట్టబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..