New Ration Card : రేవంత్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని అప్ డేట్లను పౌరసరఫరాల శాఖ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే అంటూ ముడిపెట్టింది. దీంతో ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని వారు అప్లయ్ చేస్తున్నారు. వీరంతా ఎప్పుడెప్పుడు కొత్త కార్డులు ఇస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు.
రేషన్ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిని అడ్డుకునేందుకు ఈ-కేవైసీని తీసుకొచ్చిందని తెలిసిందే. లబ్ధిదారుల వలసలు, మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు తొలగించకపోవడం తదితరాలకు చెక్ పెడుతోంది.
ఈ-కేవైసీతో బోగస్ కార్డులను గుర్తిస్తున్నారు. కార్డులో పేరున్న కుటుంబ సభ్యులు రేషన్ షాపునకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలి. లేదంటే ఆ కార్డును బోగస్ కార్డుగా పరిగణిస్తారు. ఆ తర్వాత వాటిని రద్దు చేస్తారు. అదే సమయంలో కొత్త కార్డు కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను గుర్తిస్తారు.
రేషన్ కార్డు కావాలని లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్ చేసిన తర్వాత.. కొత్తవి మంజూరు చేస్తారని తెలుస్తోంది. పాత వాటిలో లక్ష నుంచి లక్షన్నరకు పైగా కార్డులు రద్దయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.
కొత్త కార్డుకు సంబంధించి అర్హులను మార్చి నుంచి కార్డులను పంపిణీ చేస్తారని తెలుస్తోంది. కాస్త ఆలస్యమైనా.. మార్చి నెల ఆఖరు నుంచైనా.. కొత్త కార్డులు మంజూరు చేయవచ్చని తెలుస్తోంది.
తెలంగాణ, ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో రేషన్ కార్డుల ఈ-కేవైసీ ఇంకా పూర్తి కాలేదు. రేషన్ కార్డులను ఆధార్ తో అనుసంధానించే గడువును ఫిబ్రవరి చివరి వరకు పొడిగించిన విషయం తెలిసిందే.