
Super natural powers
super natural powers : తనకు అతీంద్రియ శక్తులున్నాయనే పిచ్చి నమ్మకంతో ఓ యువకుడు నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని మెక్కూరు గ్రామానికి చెందిన ప్రభు (19) బీటెక్ చదువుతున్నాడు. తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని అతడి నమ్మకం. తనకేం జరిగిన దేవుడు తనని బతికిస్తాడనే పిచ్చి నమ్మకంతో ప్రభు ఏకంగా కాలేజీ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు. కారిడార్ లో కొంతమంది విద్యార్థులు నిలబడి చూస్తుండగానే గదిలో నుంచి బయటకొచ్చి నేరుగా కారిడార్ వాల్ మీది నుంచి కిందికి దూకేశాడు.
అంత పై నుంచి కింద పడడంతో అతని కాళ్లు, చేతులు విరగడంతో పాటు తలకు కూడా తీవ్ర గాయమైంది. వెంటనే విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.