
CM Chandrababu
CM Chandrababu : హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఎన్డీయేకు శుభసూచకమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పీఎం మోదీపై నమ్మకం ఉంచిన ప్రజలు సుస్థిరత, అభివృద్ధికే ఓటేశారని అన్నారు. అటు జమ్మూకశ్మీర్ లోనూ బలమైన పార్టీగా బీజేపీ ఎదిగిందని పేర్కొన్నారు. మంచి పనులు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ లోనూ ఎన్డీయేకు మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.