Modi Campaign : మోడీలో ఆ ప్రచార ఆర్భాటం ఇంకా తగ్గలేదా?

Modi Campaign

Modi Campaign

Modi Campaign : దేశ ప్రధానిగా మోదీ కి మీడియా ఎక్కడికెళ్లినా ప్రాధాన్యత ఇవ్వడం సర్వసాధారణం. దేశ విదేశాల్లో ఆయన పర్యటనను ఆయన పర్యటనలను కవర్ చేసేందుకు ఎప్పుడూ భారత మీడియాలో ఒక స్పేస్ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మోదీకి ప్రచార పిచ్చి ఉందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తుంటాయి.

దీనికి కారణం కూడా ఉంది. పలు సందర్భాల్లో, పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నప్పుడు కెమెరా కళ్లలో పడేందుకు ఆయన చేసే పనులే ఇందుకు కారణం. గతంలో యోగా చేసేటప్పుడు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు ఇలానే చిక్కారు. అసలు దేశానికి మోదీ చేసింది ఏమి లేదని, కేవలం ప్రచారం మాత్రమే చేయించుకుంటున్నారని కాంగ్రెస్ తరచూ ఆరోపిస్తూ ఉంటుంది. 2014 ఎన్నికల్లోనూ ఇలా సోషల్ మీడియా ప్రచారం ద్వారానే ఆయన అధికారంలోకి వచ్చారని పదే పదే గతంలో కాంగ్రెస్ చెప్పుకొచ్చింది.

తాజాగా గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ హాజరయ్యారు. మ్యాచ్ వీక్షిస్తున్న తరుణంలో ఆయన తరచూ కెమెరాలవైపు చూస్తుండడం, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన కెమెరాల దృష్టిలో పడి, తద్వారా ప్రచారం చేసుకునేందుకు ప్రత్నిస్తున్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

‘కెమెరా మన్ జర ఫోకస్ కరో’ అంటూ పలువురు వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇక వీటిపై కామెంట్లు హద్దులు దాటుతున్నాయి. అయితే ఈ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవ్వగా, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లను ఓదార్చారు. ఇక ఈ వీడియోలు, ఫొటోలు చూసి మోదీలో ఇంకా ప్రచార ఆర్బాటం తగ్గలేదని  చర్చించుకోవడం కొసమెరుపు.

TAGS