YCP Bus Yatra : ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చేందుకు ఇంకా కొంత సమయడం ఉంది. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘బస్సు యాత్ర’కు ప్లాన్ చేస్తున్నారు. 21 రోజుల పాటు 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర సాగించాలని షెడ్యూల్ పెట్టుకున్నారు. కానీ, ఇది చాలా తప్పుడు వ్యూహం. ఈ విషయం ఇప్పుడు వైసీపీకి వ్యూహ కర్తలకు తెలియవచ్చింది.
జగన్ బస్సు యాత్రపై ఎక్కడా కవరేజీ లేదు. జగన్ బయట అడుగుపెడితే ఎక్కడ పెట్టాడు? ఎందుకు పెట్టాడు? అనే విశ్లేషణలతో, లైవ్ ఇచ్చే నీలి, కూలీ మీడియా ఛానళ్లు కూడా బస్సు యాత్రను కవరేజ్ చేయలేదు.. కనీసం పట్టించుకోలేదు.. కేవలం సాక్షిలో మాత్రమే కవరేజీ ఇవ్వగా.. అది కాస్తా నవ్వుల పాలైంది. జనాలు లేని దృశ్యాలే ఎక్కువగా కవర్ కావడంతో వాటిని ఎల్లో సోషల్ మీడియా షేర్ చేస్తూ ట్రోల్ చేసింది. వెంపల్లెలోకి జగన్ 10 నిమిషాల్లో వస్తున్నారని తెలిసినా 20 మంది కూడాలేరు. ఇక ఇడుపుల పాయ వైపు దృశ్యాలు చూపించేందుకు ఛానళ్లు ఇష్టపడలేదు. నీలి, కూలి మీడియా కూడా సొంత కవరేజీకి ఛాన్స్ ఇవ్వడం లేదు.
ఇడుపులపాయ నుంచి ప్రొద్దుటూర్ వచ్చే వరకు దాదాపు 3 నియోజకవర్గాలు కవర్ చేసినా బస్సు నెమ్మదిగా వచ్చినా కూడా ఆశించినంత జనం రాలేదు. ఎక్కడ చూసినా బస్సుకు ఇరువైపులా కేవలం సెక్యూరిటీ తప్పితే జనాలు కనిపించలేదు. కొన్ని ఐ ప్యాక్ స్కిట్లు వేసినా అవి కాస్తా నవ్వుల పాలయ్యాయి. వేసవిలో.. బస్సు యాత్ర.. క్యాడర్ వదిలి వలంటీర్లపై రాజకీయం చేస్తున్న సమయంలో వారు ఉత్సాహంగా వస్తారని ఆశించడం తప్పేనని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.