NDA Alliance : తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాయి. ఇంతకూ ఈ రెండు ప్రధాన పార్టీలు బీజేపీ తో ఎందుకు పొత్తు పెట్టుకున్నవి. ఏమి సాధించడం కోసం జతకట్టాయి. కమలం నాయకుల వద్ద ఏమి ఆశించి కూటమిగా ఏర్పడ్డాయి. అంటే సమాధానం దొరకదు. ఈ పొత్తుపై రాష్ట్ర ప్రజలకు కూడా అంతుపట్టడంలేదు.కానీ బీజేపీ పై ఏ నమ్మకంతో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయో ఆ రెండు పార్టీల అగ్రనేతలకే తెలుసు.
ఆంధ్ర రాష్ట్రంలో జగన్ పరిపాలన ఎలా ఉందొ ప్రజలతోపాటు, టీడీపీ, జనసేన నేతలకు తెలుసు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగి, ప్రభుత్వాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయాలంటే కేంద్రములో కమల దళం మద్దతు తప్పనిసరి. అందుకే కాషాయం నేతలతో తప్పనిసరి పరిస్థితుల్లో మంతనాలు జరిపి, ఒప్పించి కషాయంతో కూటమిగా ఏర్పడ్డాయి తెలుగుదేశం,జనసేన పార్టీలు. ఇంకో విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అత్తెసరు మెజార్టీ మాత్రమే ఉంది. ఈ మెజార్టీ గురించి కాషాయం నేతలకు స్పష్టంగా తెలుసు. సంఖ్య బలం లేదని తెలిసి కూడా బీజేపీ తో రెండు పార్టీలు పొత్తు కోసం తహ,తహ లాడటం విశేషం.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి మద్దతు దొరుకుతుందని ఆశించిన జనసేన పార్టీకి అటువంటి ఆశలు కనిపించడం లేదు. జనసేనకు ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తును పోలిన మగ్గు, బకెట్ వంటి గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్థులకు, మరొక పార్టీ అభ్యర్థులకు కేటాయించిన తీరు చుస్తే పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలు మంచి వాతావరణంలో జరిగే అవకాశాలు కనబడుటలేదని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బీజీపీ బరిలో దింపిన ఎనిమిది మంది అభ్యర్థుల గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చేశారు. జనసేన సైనికులు కూడా బీజేపీ నాయకుల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇంత కష్టపడుతున్నా ప్రధానమైన ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉండి కూడా కాషాయం నేతలు చూసి,చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలను తావిస్తోంది. అదేవిదంగా ఈ ఎన్నికలపై కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేంద్రం జోక్యం చేసుకొని ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేవిదంగ అవకాశాలు కల్పిస్తుందని పెట్టుకున్న ఆశలు అడియాశలు అయినట్టుగా భావిస్తోంది తెలుగు దేశం పార్టీ.