Shekhar Basha : బిగ్ బాస్ సీజన్ 8 లో శేఖర్ బాషా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తోంది. ఎక్కడ, ఏ పేజీ ఓపెన్ చేసినా.. శేఖర్ బాషానే కనిపిస్తున్నారు. ఆయన జోక్సే వినిపిస్తున్నాయి. ఈయనకు తోడుగా యాష్మీ ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో శేఖర్ బాషా కు వస్తున్న కామెంట్లు చూస్తుంటే ఆయనకు ఎంత పాపులారిటీ పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఎక్కడి నుంచి వచ్చారు బయ్యా.. ఒక్క వల్గర్ కంటెంట్ లేకుండా ఇలాంటి జోక్స్ వేయడం మీకే సాధ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న చిన్న లాజిక్ లతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు శేఖర్ బాషా. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఎలా ఉంటున్నారో కానీ.. బయట ప్రేక్షకులు మాత్రం శేఖర్ బాషాకు ఫ్యాన్స్ అయిపోయారు.
అంతలా ఈ సీజన్ లో శేఖర్ బాషానే ఆకట్టుకుంటున్నాడు. కానీ హాట్ స్టార్ లో అతడికి సంబంధించిన ఎక్కువ పుటేజీని కనిపించకుండా బిగ్ బాస్ జాగ్రత్త పడుతున్నాడు. తాజాగా ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలిసిన చాలా మంది బాధపడుతున్నారు. ఆయన భార్య ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి అని.. తెలుస్తోంది. సెప్టెంబర్ 14 వ తేదీన ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని హైలైట్ చేసుకోకుండా అసలు ఏ మాత్రం పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకోకుండా తన ఆట తాను ఆడుతూ అందరినీ ఎంటర్ టైన్ చేస్తున్నాడు.
ఈ విషయం కాస్త బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందే ఒక ఇంటర్వ్యూలో శేఖర్ బాషా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం.. అతడి భార్య గర్భవతి గా ఉన్న విషయం వెల్లడవుతోంది. కానీ అర్జున్ లాగా తన భార్య గర్బవతిగా ఉందని సింపథీ కోసం ఎక్కడ కూడా ప్రయత్నించకుండా ఉంటున్న శేఖర్ బాషాకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. నీకు టాప్ 5 లో ఉండే అర్హత ఉంది బాయ్ అనుకుంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.