JAISW News Telugu

Veeramallu : పవన్ రాజకీయాల్లోనూ వీరమల్లులా పోరాడిల్సిందేనా?

Veeramallu

Veeramallu

Pawan Veeramallu : దాదాపు ఏడాది తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాన్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాడు. సెప్టెంబర్ 23న పవన్ కల్యాన్ హరిహర వీరమల్లు సెట్లో అడుగు పెట్టారు. ఈ విషయాన్ని నిర్మాతలు ఎక్స్(ట్విట్టర్) లో వెల్లడించారు. హరిహర వీరమల్లు సినిమాను 2025 మార్చి 28న విడుదల చేయబోతున్నామని కూడా ప్రకటించారు. దీంతో ఒకే రోజు పవన్ అభిమానులకు రెండు అప్ డేట్లు వచ్చాయి.  ఇక పవన్ మళ్లీ సినిమాలు చేస్తుండడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదే క్రమంలో అటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ దర్శక నిర్మాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా తమ సినిమాలు కూడా పూర్తి చేసి పెట్టాలని కోరుతున్నారు.

ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాన్ ఓజీ, ఉస్తాద్ సినిమాలు చేస్తాడా అనేది ఇప్పటికైతే కొంత అనుమానమే. హరిహర వీరమల్లు సినిమా ప్రారంభించి దాదాపు మూడేళ్లు దాటింది. ఇంకా ఆలస్యం చేస్తే నిర్మాతకు నష్టమే తప్ప లాభం లేదు. దీంతో పవన్ నిర్మాతను దృష్టిలో పెట్టుకొని తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేయడానికి ముందుకు వచ్చాడు. అయితే ప్రస్తుతం పవన్ ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. దీక్షలో ఉండి షూటింగ్ ఎలా చేస్తాడంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదే కాదు పవన్ కల్యాన్ ఏం చేసినా విమర్శించే వాళ్లకు నోటికి పని దొరికినట్లే.

రేపటి కల్లా మిగతా సినిమాలు కంప్లీట్ చేసే ఉద్దేశంతో షూటింగ్ కు వెళ్లినా విమర్శకుల నోళ్లకు తాళం తీసినట్లే అవుతుంది. సినీ నటులు సినిమాలు చేసుకోక రాజకీయాల్లో ఉండడం ఎందుకంటూ నోరెత్తుతుంటాయి. ఇక ఇప్పుడు పవన్ హరిహర వీరమల్లులా సినిమాల్లోనూ రాజకీయంగా పోరాటం చేయక తప్పదేమో. దాదాపు పదేళ్లు ఏ పదవి లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అధికాపార్టీ విధానాలను ఎండగట్టాడు. ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉండడంతో ప్రతిపక్ష నాయకుల నోళ్లను మూయించేందుకు పవన్ పోరాడాల్సిందే.

Exit mobile version