KCR : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు ఎవరంటే కేసీఆర్. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసింది ఎవరంటే కూడా కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటి సీఎం కేసీఆర్. రెండోదఫా జరిగిన ఎన్నికల్లో సైతం ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక నాకు తిరుగులేదనే భావన కేసీఆర్ తో పాటు బిఆర్ఎస్ శ్రేణుల్లో ఏర్పడింది.కానీ రెండోసారి ఏర్పడిన ప్రభుత్వంపై దశల వారిగా వ్యతిరేక పవనాలు వీచడం మొదలైనాయి.పబ్లిక్ కమిషన్, పదోతరగతి, మెడికల్,ప్రశ్న పత్రాలు లీక్ కావడం గత ప్రభుత్వాల హయాంలో జరుగలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కూడా వ్యతిరేకత మొదలైనది. ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో జరిగిన అవినీతి ప్రభుత్వ పనితీరుకు పెద్ద దెబ్బ. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ ఒక్క నెల కూడా వేతనాలు సకాలంలో ఇచ్చింది లేదు. వాళ్లకు డీఏ మంజూరు సరిగా ఉండేది కాదు.
విలేఖరుల సమావేశ ఏర్పాటుచేసిన సందర్భాల్లో జర్నలిస్టులను ఏకవచనముతో, వయా అంటూ సంబోదించేది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు నీది ఏ పేపర్, మీ ఎడిటర్ ఎవరు అంటూ ఎదురుదాడికి దిగేది. సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబించేది. అప్పుడు నేను అట్లా అన్నానా. ఇంతకూ నువ్వు అక్కడ ఉన్నావా అంటూ ఎదురు ప్రశ్నలు వేసి జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేసేది. అలన్నిటి కేసీఆర్ టీవీ 9 కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అండి, గారు అని సంబోధిస్తూ మాట్లాడిన తీరు చూస్తుంటే మీడియా పై ఇంత ప్రేమ పుట్టుకువచ్చిందా అనే అనుమానం జర్నలిస్టుల్లో వ్యక్తం అవుతోంది.
తెలంగాణ రాష్ట్రం బంగారు తునక అవుతుంది అని చెప్పిన కేసీఆర్ నేడు అప్పుల కుప్పచేయడంతో కోలుకోలేని విదంగా రాష్ట్రము తయారైనది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే కుట్ర జరుగుతుంది అని చెప్పి ఓటర్లను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ ప్రయత్నాన్ని నేనే అడ్డుకున్న అని చెప్పి నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఉమ్మడి రాజధాని చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించే విధానంలో కూడా స్పష్టత లేదు. ఉమ్మడి రాజధాని కి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ రాష్ట్రము ఇప్పుడిప్పుడే కోలుకొని, అభివృద్ధి చెందుతోంది.