Kattappa Character : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా మోస్ట్ ఎవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ చిత్రం మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం దేశమంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 350 కోట్లు దాటిందని బీటౌన్ టాక్. విడుదలకు ఎన్నో సంచలనాలను సృష్టిస్తున్నది కల్కి.
కల్కి 2898 AD రెండో ట్రైలర్ కూడా వచ్చేసింది. కొత్త క్లూలు, కథకు సంబంధించి అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నది. అయితే రెండు ట్రైలర్‌లను కలిపి చూస్తే, సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర కీలకమని తెలుస్తున్నది. బిగ్ బీ సినిమాను నడిపించే క్యారెక్టర్ చేస్తున్నట్ల అర్థమవుతున్నది. ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత అత్యధికంగా ఆకట్టుకుంటున్నది బిగ్ బీ పాత్రనే అని చెప్పుకోవచ్చు.
అమితాబ్ అశ్వత్థామ పాత్రలో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. రెండో ట్రైలర్ లో అమితాబ్ పాత్రకు పెద్దపీట వేస్తున్నట్లు అర్థమవుతున్నది. భారీ ఫైటింగ్ లు, విన్యాసాలతో బిగ్ బీ ఆకట్టుకుంటున్నాడు. ఇదే సమమయంలో బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ తో కల్కి మూవీలోని అమితాబ్ క్యారెక్టర్ ను పోల్చుతున్నారు.
అమితాబ్ క్యారెక్టరైజేషన్ కట్టప్పను గుర్తుకు తెస్తున్నదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్, అమితాబచ్చన్ మధ్యలో ఉండే ఫైట్ సీన్స్ బాహుబలి పార్ట్-1లో ఇంటర్వెల్ సీన్ ను తలపిస్తున్నదనే చర్చ మొదలైంది. ఒక ప్రాంతానికి రక్షకుడిగా ఉన్న బిగ్ బీ భైరవతో ఎందుకు పోటీ పడుతున్నాడు. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య ఉన్న శత్రుత్వం ఏమిటి? అనే చర్చ సాగుతున్నది. ఇక కట్టప్ప క్యారెక్టర్ లో ఉన్న షేడ్స్ అమితాబచ్చన్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాయంటూ పలువురు పేర్కొంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈనెల 27వ వరకు ఆగాల్సిందే.