Haryana and Jammu Kashmir Election Results : హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. హర్యానాలో అక్టోబర్ 5న 90 సెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 464 మంది స్వతంత్రులు, 101 మంది మహిళలు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్-17, బీజేపీ-5 అధిక్యంలో ఉన్నారు.
జమ్మూ కశ్మీర్లోనూ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక్కడి 90 నియోజకవర్గాల్లో సెప్టెంబరు 18, 25, 1క్టోబరు 1న మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. 90 నియోజకవర్గాల్లో 873 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జమ్ము కాశ్మీర్ పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ-16, కాంగ్రెస్ కూటమి-28, పీడీపీ-3, ఇతరులు-3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.