Khattar Resigns : హర్యానాలో ఐదేళ్లుగా జన్ నాయక్ జనతా పార్టీ తో కలిసి ప్రభత్వాన్ని కొనసాగిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో హర్యా నాలో ప్రభుత్వం కుప్పకూలిపోయింది.
దష్యంత్ చౌతాలా నేతృత్వంలోనే జేజేపీ విభేదాలు తారా స్థాయికి చేరడంతో ఎన్నికల వేళ ఆ పార్టీని వదిలించుకోవాలని నిర్ణయించుకున్న బీజేపీ..ఈ గదిశహగా అడుగు లేసింది. ఖట్టర్ ను ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలో దించాలని బీజేపీ భావిస్తోంది.
లోక్ సభ ఎన్నికల్లో బిజేపీ-జేజేపీ పొత్తులో బాగంగా సీట్ల పంపకాలపై మెదలైన ప్రతిష్టంభన ప్రభుత్వం కుప్పకూలే వరకు వచ్చింది. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లలో రెండింటిని తమకే కేటాయించాల్సిందేనని జేజేపీ చేసిన డిమాండ్ ను బీజేపీ అంగీకరించలేదు.
దీంతో ఇరు పార్టీల పరస్పరం విమర్శలుి చేసుకోవడం మెదలు పెట్టాయి. చివరకు లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ బీజేపీ అధిష్టానం తమ ముఖ్యమంత్రిని ఖట్టర్ తో రాజీనామ చేయించింది.