Harsha sai : ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, తనను మోసం చేశాడని ఓ యువతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానంటూ తనను నమ్మించి శారీరకంగా లొంగదీసుకోవడంతో పాటు తన నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. దీనిపై మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ లో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం హర్షసాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
దీనిపై హర్షసాయి ఓ వీడియో విడుదల చేసి తన తప్పు ఏం లేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ యువతి డబ్బుల కోసమే తనపై ఆరోపణలు చేసిందని, తనేమిటో తన అభిమానులకు తెలుసని పేర్కొన్నాడు. త్వరలోనే నిజం బయటపడుతుందన్నాడు. ఇకపై ఈ విషయం గురించి తన లాయర్ మాట్లాడతారని వీడియోలో వెల్లడించాడు.
తాజాగా ఈ కేసుకు సంబంధించి బాధిత యువతికి, హర్షసాయికి మధ్య జరిగిన పలు ఫోన్ కాల్స్ సంభాషణలకు సంబంధించిన రికార్డులు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ ఆడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రెండు కాల్స్ కు సంబంధించిన ఆడియోలు ట్విట్టర్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఒక ఆడియోలో బాధిత యువతి, హర్షసాయి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తున్దని. ఇద్దరూ గట్టిగా వాదించుకోవడం ఈ ఆడియో ద్వారా స్పష్టమవుతున్నది. మరో ఆడియోలో బాధిత యువతి హర్షసాయితో చాలా క్లోజ్ గా మాట్లాడుతుండా హర్షసాయి ‘ఊ ఆ’ ,హ హ అంటూ నవ్వడం వినిపించింది. ఈ ఆడియోలను బాధితురాలలే స్వయంగా పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు ఉంటే ఇవ్వాలని పోలీసులు కోరారని సమాచారం.