Harish Rao : కాంగ్రెస్ కు మేలు చేస్తున్న హరీష్ రావు సవాళ్లు
Harish Rao : మూడోసారి అధికారం చేపడుతామని కళలు కన్న గులాబీ నేతలు ఆశలు అడియాసలయ్యాయి.ఒక్కసారి అధికారం కోల్పోవడంతో భారత రాష్ట్ర సమితి నాయకుల్లో రాజకీయ నిరుద్యోగం ఏర్పడింది.నాయకులతో పాటు మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు మాజీ మంత్రి హరీష్ రావు లకు కూడ కాంగ్రెస్ ను ఎలా ఎదుర్కోవాలో అంతుపట్టక తలపట్టుకుని పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు పార్టీని ఎలా కాపాడుకోవాలో కూడా అంతుపట్టడంలేదు. చేజారిపోతున్న నాయకులను కూడా ఎలా నిలపాలి అర్థంకాని పరిస్థితి ఏర్పడింది కేసీఆర్ కు. అంతే కాదు పార్టీ గుర్తుపై గెలిచిన నాయకులు కూడా పార్టీని వదిలిపెట్టి పోవడాన్ని కూడా జీర్ణించు కోలేక పోతున్నారు కేసీర్,కేటీఆర్,హరీష్ రావు.
కాంగ్రెస్ తో పాటు కాషాయం నాయకులకు కట్టడి చేయడానికి సభలు,సమావేశాల్లో హారిష్ రావ్ చేస్తున్న ప్రసంగాలు సొంత పార్టీ కి మేలు చేయకుండా అవతలి పార్ట వాళ్ళకే మేలు చేసేవిదంగా ఉన్నాయనే అభిప్రాయాలురాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.
తన పర్యటనలో హరీష్ రావ్ నిత్యం రైతు రుణమాఫీ పై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదంటున్నారు.రుణమాఫీ చేస్తావా లేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి కి సవాల్ విసురుతున్నారు. ఆగష్టు 15 తేదీలోగా ప్రతి రైతు కు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయకపోతే పదవికి రాజీనామా చేస్తావా అంటూ సీఎం కు సవాల్ విసురుతున్నారు. హరీష్ రావ్ సవాల్ కు రేవంత్ రెడ్డి కూడా తగిన విదంగానే జవాబు ఇచ్చారు.తాను ప్రకటించిన తేదీలోగా రుణమాఫీ చేసి తీరుతా… ఆలా జరిగిన నేపథ్యంలో ని భారత రాష్ట్ర సమితి పార్టీని రద్దు చేయాలి,అదేవిదంగా నీవు అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు ఎంసీ రేవంత రెడ్డ్.నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న, రాజీనామా లేఖతో అమరవీరుల స్తూపం వద్దకు వస్తున్నా… నువ్వు కూడా వస్తావా అంటూ హరీష్ రావ్ సవాల్ విసిరారు.
రుణమాఫీ పై రాజకీయంగా ఎంత చర్చ జరిగితే అంత మేలు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని రాజకీయ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఆలోచన విధానాన్ని పసిగట్టని హరీష్ రావు రెచ్చిపోయి ఎక్కువ చర్చ జరగడానికి అవకాశాలను కాంగ్రెస్ పార్టీకి కల్పిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. హరీష్ రావు రోజుకో సవాల్ విసురుతుంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నష్టం కంటే లాభమే ఎక్కువ చేస్తున్నాడని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.