Hardik Pandya : నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి హైదరాబాద్ జట్టు 277 పరుగులు చేసింది. ఇలా చరిత్ర తిరగరాయడంలో హైదరాబాద్ బ్యాటర్ల ఘనత ఎంత ఉందో.. హార్దిక్ ఫెయిల్యూర్ కూడా అంతే ఉందంటున్నారు నెటిజన్లు. పాండ్యా తీసుకున్న నిర్ణయాలను చూసి ఇలాంటి చెత్త కెప్టెన్సీని ఎక్కడా చూడలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్ లో పాండ్యా బౌలింగ్ ఎంచుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్ ను జట్టులో పెట్టుకుని నాలుగో ఓవర్ కు బంతిని అతడికి ఇచ్చాడు. అప్పటివరకు పరుగుల వరద పారించిన హైదరాబాద్ బ్యాటర్లను బుమ్రా కట్టడి చేశాడు. అప్పటికీ టీం స్కోర్ 45/0 గా పరుగులుగా ఉంది.
మ్యాచ్ లో బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తుంటే..పాండ్యా నవ్వు కనిపించడం ముంబై ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత చిన్న పిల్లాడిలా చప్పట్లు కొడుతూ కనిపించాడు.
పాండ్యా కెప్టెన్సీని సగటు అభిమానులే కాదు క్రికెట్ ప్రముఖులు కూడా విమర్శిస్తున్నారు. నిన్నటి మ్యాచ్ లో కెప్టెన్ గా పాండ్యా తేలిపోయాడని పఠాన్ బ్రదర్స్ తెలిపారు. 11 ఓవర్లకు 160+ స్కోర్ ఉన్నప్పుడు బుమ్రాకు కేవలం ఒక్క ఓవరే ఇవ్వడం ఏంటని యూసుఫ్ పఠాన్ విమర్శించారు. లక్ష్య ఛేదనలో మిగతా బ్యాటర్లు 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తుంటే కెప్టెన్ హర్దిక్ 120 స్ట్రైక్ రేట్ తో ఆడారని ఇర్ఫాన్ ట్వీట్ చేశారు.