Hardik-Natasha : హార్దిక్-నటాషా విడాకులు.. బీజం పడింది అక్కడే.. అతడే విడగొట్టాడు
- ముగిసిన మరో క్రీడాకారుడి వైవాహిక బంధం
కొడుకు అగస్త్య గురించి కూడా రాశారు. ‘అగస్త్యుడితో మేం ఆశీర్వదాం పొందాం. అతను మా ఇద్దరి జీవితాలకు కేంద్రంగా ఉంటాడు. అతనికి అన్ని రకాల ఆనందాన్నిచ్చేలా అతనిని పెంచుతాం. ఈ కష్టమైన, సున్నితమైన సమయంలో మాకు గోప్యతను అర్థం చేసుకోవాలని కోరారు.
రెండు పద్ధతుల్లో వివాహం
హార్దిక్ -నటాషా రెండుసార్లు వివాహం చేసుకున్నారు. 2020లో, లాక్‌డౌన్ మధ్య వారిద్దరూ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత గతేడాది ఫిబ్రవరిలో కూడా హార్దిక్, నటాషా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఉదయపూర్‌లో రాజ పద్ధతిలో రెండో పెళ్లి చేసుకున్నారు. న్యూ ఇయర్ 2020 సందర్భంగా, నటాషాతో నిశ్చితార్థాన్ని హార్దిక్ ప్రకటించారు.
ఐపీఎల్ సమయంలోనే విడాకుల వార్త
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సందర్భంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నప్పుడు, సోషల్ మీడియాలో హార్థిక్- నటాషా విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఏ పబ్లిక్ ఈవెంట్‌లోనూ ఇద్దరూ కలిసి కనిపించలేదు. వారిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంలో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇప్పుడు వారు ఉమ్మడి ప్రకటనతో విడాకుల విషయాన్ని ధ్రువీకరించారు.