JAISW News Telugu

Hardik-Natasa : హార్థిక్, నటాషా కలిసి పోయారా? ఆ ఫొటోలు షేర్ చేయడంలో అర్థ మేంటి?

Hardik-Natasa

Hardik-Natasa

Hardik-Natasa : కొంతకాలంగా నటాషా స్టాంకోవిచ్, హార్దిక్ పాండ్యా విడాకుల గురించి పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాకపోవడంతో వారి మౌనం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. తాజాగా నటాషా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.


వాలంటైన్స్ డే, వారి పెళ్లి వంటి ముఖ్యమైన క్షణాలతో సహా హర్థిక్ తో కలిసి ఉన్న అన్ని ఫోటోలను నటాషా తన ఇన్ స్టా ప్రొఫైల్లో షేర్ చేసింది. దీంతో ఈ జంట కలిసి దిగిన ఫొటోలను చూసిన అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. గతంలో తొలగించిన, ఇప్పుడు మళ్లీ యాడ్ చేయడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నటాషా తన ఇన్ స్టా నుంచి ‘పాండ్యా’ అనే పదాన్ని తొలగించి, వారి పెళ్లి ఫోటోలను ‘డిలీట్’ చేయడంతో విడాకుల పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా తన కుమారుడు, అగస్త్య, హార్దిక్, నటాసా బిడ్డతో కలిసి ఆడుకుంటున్న ఫోటోను షేర్ చేశాడు. హార్ట్ ఎమోజీతో నటాషా స్పందించిన తీరు వీరిద్దరి రిలేషన్షిప్ స్టేటస్ పై మరింత ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

లండన్ లో విహారయాత్రకు వెళ్లిన హార్దిక్ T20 ప్రపంచకప్ భారత జట్టుకు గైర్హాజరయ్యాడు. ఆ తర్వాత నేరుగా న్యూయార్క్ లో టీమిండియాలో చేరనున్నట్లు సమాచారం.

లాక్ డౌన్ సమయంలో 2020 మేలో హార్దిక్-నటాషా వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు అగస్త్య ఉన్నాడు. 

Exit mobile version