Sai Dharam Tej-Vaishnav Tej : సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లకు గడ్డు రోజులు.. మెగా అభిమానులు ఏమైనా ఆదుకుంటారో చూడాలి

Sai Dharam Tej-Vaishnav Tej
Sai Dharam Tej-Vaishnav Tej : మెగాస్టార్ మేనల్లుళ్లుగా సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సినీ ఇండస్ట్రీలో ప్రవేశించారు. సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి, ప్రతి రోజూ పండగే లాంటి మంచి హిట్ లు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ కావడంతో సినిమాల్లో కాస్త వేగం తగ్గించాడు. చివరగా పవన్ కల్యాణ్ తో బ్రో సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు.
వైష్ణవ్ తేజ్ కొండపొలం పర్వాలేదనిపించినా.. రంగరంగ వైభవంగా, ఆదికేశవ పూర్తిగా డిజాస్టర్ గా మిగిలిపోయాయి. దీంతో వైష్ణవ్ ఆచితూచి అడుగులు వేయడానికి సిద్ధమయ్యారుడు. పలాస మూవీ డైరెక్టర్ కరుణ కుమార్ వరుణ్ తేజ్ తో మట్కా మూవీ చేస్తుండగా.. ఇది అయిపోగానే వైష్ణవ్ తేజ్ తో మరో మూవీ చేయనున్నాడని టాక్. దీని కోసం కథను కూడా సిద్ధం చేసుకుని నిర్మాత కోసం వెయిటింగ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.
బ్రో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి ఒక్క మూవీ కూడా రాలేదు. గాంజా శంకర్ మూవీ క్యాన్సిల్ అయింది. చిత్రలహరి 2 ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. సాయి ధరమ్ తేజ్ హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ రాబోతుందని సమాచారం. ఈ సినిమా కోసం న్యూ డైరెక్టర్ ను పరిచయం చేయనున్నాడు. దీని కోసం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
వైష్ణవ్ తేజ్ మట్కా మూవీ అయ్యే దాకా వెయిట్ చేస్తాడా.. లేక మరో మూవీ కి కమిట్ మెంట్ ఇస్తాడా అనేది తెలియడం లేదు. మూడు సినిమాలు కూడా ఫెయిల్ కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. బ్రదర్స్ ఇద్దరు ప్రస్తుతం బాగా గ్యాప్ తీసుకున్నారు. ఇలా చేయడం కూడా మంచిది కాదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మంచి కథతో, కథనంతో ముందుకు రావాలని మెగా అల్లుళ్లు కోరుకుంటున్నారు. మరి ఈ సారి సాయి ధరమ్ తేజ్ నుంచి ఎలాంటి మూవీ రానుందోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.