
Mothers Day wishes-Bhashyam Praveen
Bhashyam Praveen : పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రజలకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఓ ప్రకటనలో మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న అన్ని ఆనందాలకు అర్హత గల వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. ఆదివారం మాతృ దినోత్సవం పురస్కరించుకుని ఆయన ప్రకటన విడుదల చేశారు.
‘‘ఎన్ని యుగాలు మారినా.. ఎన్ని తరాలు దాటినా మారని మాధుర్యం అమ్మ ప్రేమ. ఏ దేశమేగినా.. ఏ తీరం దాటినా మరువని మమకారం అమ్మ ప్రేమ’’ అని భాష్యం ప్రవీణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.