Vijay Deverakonda : జీవితం అంటే సాధారణంగా జరిగేది కాదు.. ఏక్కడ తొక్కాలో.. ఎక్కడ లేపాలో దానికి తెలిసినంత ఇంకోదానికి తెల్వదు. ఎలాంటి కష్టాలు లేకుండా సాదాసీదాగా సాగితే ఏం కిక్కు ఉంటుంది. అలాంటి జర్నీనే విజయ్ దేవరకొండది..
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వస్తున్నాడు. డిజాస్టర్లు, బ్లాక్ బస్టర్లను సమానంగా తీసుకుంటూ ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హీరో అనే ఇమేజ్ ని మోస్తూనే ఉన్నాడు. నేడు 35వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు..
క్యారెక్టర్ అర్టిస్ట్ గి చిన్న చిన్న సినిమాలు చేసే విజయ్ ‘పెళ్లి చూపులు’తో హీరోగా మారాడు. ఈ సినిమా సక్సెస్ అయినా.. ఆయనకు మాత్రం గుర్తింపు రాలేదు. ఆయనకు భారీగా గుర్తింపు తెచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. ఇది బ్లాక్ బస్టర్ గా నిలవడంతో కల్ట్ స్టేటస్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత భారీ వసూళ్లను దక్కించుకుంది ‘గీత గోవిందం’.
డ్రై రన్ తర్వాత విజయ్ కి ఖుషి సినిమాతో మంచి వసూళ్లు వచ్చాయి. ఫ్యామిలీ స్టార్ తో కొంత గ్యాప్ ఏర్పడింది. కానీ విజయ్ చేతిలో మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులు ఉన్నాయి.
రౌడీ బాయ్ లో మరో కోణం దాగుంది. కేవలం సినిమాలు చేయడమే కాదు. దాతృత్వ కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు. ఖుషి సమయంలో లక్షా 100 మందికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు విజయ్. అనంతరం దేవరసంత కార్యక్రమంలో భాగంగా 100 మందిని హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు పంపించారు.
కొవిడ్ సమయంలో మధ్య తరగతి కుటుంబాలను, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు మిడిల్ క్లాస్ ఫండ్ కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఫస్ట్ జాబ్ ప్రోగ్రామ్ లో భాగంగా 40 మంది యువతకు తొలి ఉద్యోగం ఇచ్చారు.
గౌతమ్ తిన్ననూరితో, రాజా వారు రాణి గారు ఫేమ్ రవి కోలాతో, ఆ తర్వాత వీడీతో టాక్సీవాలా సినిమా తీసిన రాహుల్ సాంకృత్యాన్ తో సినిమాలు లైన్ లో పెట్టాడు విజయ్.
మరీ ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు, సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి అగ్ర నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుండడంతో యూత్ బాక్సాఫీస్ అవకాశాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి.
విజయ్ తక్షణ లైనప్ గురించి మంచి విషయం ఏంటంటే, అతను వారి గత చిత్రాలతో సాంకేతిక సామర్థ్యాలను చూపించిన ప్రతిభావంతులైన యువ దర్శకులతో కలిసి పనిచేస్తున్నాడు. ఈ సానుకూల బలం ఈ కాలానికి అవసరం మరియు అతను తదనుగుణంగా పనిచేస్తున్నాడు.