Hanuman Character : హనుమంతుడి పాత్ర లుక్ ఆయనదేనా..? తేజ సజ్జా ఏం చెప్పాడు?

Teja Sajja about hanuman character

Teja Sajja about hanuman character

Hanuman Character : మెగాస్టార్ ‘చూడాలని ఉంది’ రెండేండ్ల పిల్లాడి వయస్సులో ఉన్నప్పుడే తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బుల్లి ‘ఇంద్ర’గా కత్తిపట్టి తొడగొట్టాడు. ఇప్పుడు ‘హను-మాన్’గా సంక్రాంతి బరిలో తేజ సజ్జా విజేతగా నిలిచాడు. చిన్న సినిమాగా వచ్చి భారీ బడ్జెట్ మూవీల కన్నా ఎంతో గొప్పగా.. తక్కువ బడ్జెట్ లో అద్భుతంగా తెరకెక్కిన ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ ఇటీవల విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా కథానాయకుడు తేజ సజ్జా మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమా ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, అయినా  ఏదో దైవశక్తి తమ వెనకుండి నడిపిస్తున్నట్లు అనిపించేదని, దాని వల్లే ఏ సమస్య ఎదురైనా దానంతట అదే తీరిపోతుందని బలంగా నమ్మానని చెప్పారు. ఆ హనుమంతుడు సముద్రం దాటినట్టు తాము కూడా అన్ని అడ్డంకులు దాటుకుని సాఫీగా థియేటర్లలోకి వచ్చామన్నారు. ఇప్పుడు సినిమాకు వస్తున్న ఆదరణ చూసి చాలా ఆనందం వేస్తోందన్నారు. ఇతర భాషల్లో తాము పెద్దగా ప్రచారం చేయకున్నా కేవలం మౌత్ టాక్ తోనే మంచి కలెక్షన్లు సాధిస్తోందన్నారు.

ప్రతీ హీరోకు ఓ మైల్ స్టోన్ మూవీ ఉంటుందని, తన హను-మాన్ మాత్రమే అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి మూవీ వస్తుందో రాదో కూడా తెలియదన్నారు. తెలుగులో సంక్రాంతి వేళ ఇంత టఫ్ ఫైట్ ఉన్నా.. థియేటర్ల కొరత లాంటి సమస్యలు ఉన్నా ముందడుగు వేశామన్నారు. తాము ముందునుంచి నమ్మింది.. చెప్పింది ఒకటే. సినిమానే మాట్లాడుతుంది.. సినిమానే నిలబడుతుంది.. మిగతా మనమెన్ని ప్రయత్నాలు చేసినా.. అవన్నీ ఫస్ట్ షో వరకు మాత్రమ ఉపయోగపడుతాయి.. ఆ తర్వాత సినిమానే మాట్లాడుతుంది అని చెప్పుకొచ్చారు.

సినిమాలోని యాక్షన్ సిక్వెన్స్ అన్నీ కూడా ఒరిజినల్ గా చేసినవేనన్నారు. అండర్ వాటర్ సీక్వెన్స్.. క్లైమాక్స్ లో హనుమంతుల వారు వస్తున్నప్పుడు నేను గాల్లో ఉండే సీక్వెన్స్ ప్రతీది డూప్ లేకుండానే చేశాం. ఆ గాల్లో ఉండే సీక్వెన్స్ కోసం ఐదు రోజులు కష్టపడ్డామన్నారు. అలాగే సినిమాలో కనిపించే హనుమాన్ విగ్రహం షాట్ ను గ్రాఫిక్స్ లో సిద్ధం చేయడానికి ఆరు నెలలు పట్టిందని తెలిపారు.

హను-మాన్ లో హనుమంతుడి పాత్రను చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో..తేజ స్పందిస్తూ.. ఈ ప్రాజెక్ట్ గురించి చిరుసార్ కు మొదటి నుంచి తెలుసన్నారు. ప్రశాంత్ వర్మ ఉద్దేశం కూడా ఆయనకు తెలుసు..కాకపోతే గ్రాఫిక్స్ చేస్తున్నప్పుడు కొన్ని లేయర్స్ లో లుక్ ను మ్యాచ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి.. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చిరు సార్ కు తెలుసంటూ వివరించారు. ఇక సినిమా విడుదల కాగానే ‘‘కంగ్రాంట్స్ మై బాయ్’’ అంటూ మెసేజ్ పెట్టడం ఆనందంగా అనిపించింది.

TAGS