Hanuman Collections : బాక్స్ ఆఫీస్ వద్ద ‘హనుమాన్’ చిత్రం ట్రేడ్ పండితులు సైతం నివ్వరపోయే రేంజ్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్ల రూపాయిలకు జరిగితే మొదటి రోజే దాదాపుగా 50 శాతం కి పైగా రికవరీ ని సాధించింది.
ఈ రేంజ్ వసూళ్లు వచ్చిన తర్వాత, పక్క సినిమా ‘గుంటూరు కారం’ కి నెగటివ్ టాక్ కారణంగా కనీసం స్థాయి వసూళ్లు కూడా లేకపోవడం తో ఆ సినిమాకి కేటాయించిన షోస్ మొత్తాన్ని ‘హనుమాన్’ కి షిఫ్ట్ చేసారు. దీంతో హనుమాన్ వసూళ్లు అత్యధిక సెంటర్స్ లో మొదటి రోజు కంటే ఎక్కువ షేర్ వసూళ్లు వచ్చాయి.
ఉదాహరణకి నార్త్ అమెరికా లో ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి ఈ సినిమాకి 9 లక్షల డాలర్ల వసూళ్లు వస్తే, రెండవ రోజు ఏకంగా 8 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుండి #RRR , ‘సలార్’ , బాహుబలి సిరీస్ కి తప్ప ఏ చిత్రానికి కూడా రెండవ రోజు ఇంత వసూళ్లు రాలేదని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. నైజాం ప్రాంతం లో కూడా ఇదే పరిస్థితి. రెండవ రోజు ఏకంగా ఇక్కడ రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తక్కువ థియేటర్స్ తో ‘గుంటూరు కారం’ బయ్యర్స్ ఈ చిత్రాన్ని తొక్కేస్తున్నా కూడా ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రెండవ రోజు ఈ సినిమాకి గుంటూరు కారం కంటే ఎక్కువ షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా చూసుకుంటే రెండవ రోజు తెలుగు రాష్ట్రాల నుండి 9 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటేసి సంక్రాంతి విన్నర్ గా నిల్చింది. రాబొయ్యే రోజుల్లో ఇదే ఊపుని కొనసాగిస్తూ ముందుకు పోతే వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.