JAISW News Telugu

Hanuman : అక్కడ గుంటూరు కారంపై హను-మాన్ పైచేయి..

Hanuman

Hanuman and Gunturkaaram

Hanuman : ’అనుకున్న దొక్కటి.. ఐనది ఒక్కటి’ ఇండస్ట్రీలో ఒక సినిమా విషయంలో ఇదే జరిగింది. సంక్రాంతికి బాగా హైప్ మీద వచ్చిన సినిమా బోల్తా కొట్టింది. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో గుంటూరు కారం, హను-మాన్, సైంధవ్ వీటిలో గుంటూరు కారం, సైంధవ్ కు మిక్స్ డ్ టాక్ రాగా.. హనుమాన్ కు మాత్రం బాక్సాఫీస్ టాక్ వచ్చింది.

ఇందులో సైందవ్ ను కాస్త పక్కన పెడితే గుంటూరు కారం, హను-మాన్ నే సినీ అభిమానులు ఆదరిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో కూడా బుక్ మై షోలో గుంటూరు కారం కంటే హను-మాన్ కే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. బుక్ మై షోకు గంటకు ఏ సినిమాకు ఎన్ని టికెట్లు బుక్ అవుతున్నాయో ఇటీవల వివరాలు ప్రకటించింది.

గుంటూరు కారంకు గంటకు 12600 బుక్ కాగా హను-మాన్ కు 16600 టికెట్లు బుక్ అవుతున్నాయట. నిన్న (జనవరి 12) జరిగిన బుకింగ్స్ పరిశీలిస్తే ఈ లెక్కలు వెలుగులోకి వచ్చాయి. యూఎస్ లో కూడా హను-మాన్ కు ఊహించని స్థాయిలో బుకింగ్స్ వస్తున్నాయట. ఇక, హైదరాబాద్ లో 230 షోలకు 228 షోలు హను-మాన్ ఫుల్ కాగా గుంటూరు కారం థియేటర్ల సంఖ్యతో పోలిస్తే ఫుల్ అయిన థియేటర్లు తక్కువగా ఉన్నాయట.

గుంటూరు కారం స్టార్ స్టేటస్ తో వచ్చింది. స్టార్ డైరెక్టర్, అంతకంటే పెద్ద స్టార్ హీరోతో వచ్చింది. కానీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఈ లెక్కన చూస్తే స్టార్ స్టేషన్ కన్నా కంటెంట్ ఇంపార్టెంట్ అని చిన్న సినిమాలు కూడా భారీ స్టార్లను తట్టుకొని నిలబడతాయని హను-మాన్ నిరూపించింది. హను-మాన్ బుకింగ్స్ కూడా అదుర్స్ అనేలా ఉండగా ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. హనుమాన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది.

హను-మాన్ కు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ. 30 కోట్ల బిజినెస్ చేసిన హనుమాన్ ఫుల్ రన్ టైంలో బడ్జెట్ కు రెట్టింపు రాబడుతుందని తెలుస్తోంది.

Exit mobile version