HanuMan Tickets : హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్న ‘హనుమాన్’ ప్రీమియర్ షో టికెట్స్..
HanuMan Tickets : చిన్న సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడం మనం చాలా తక్కువ సందర్భాల్లో చూస్తుంటాం. రీసెంట్ గా మనం ‘హనుమాన్’ చిత్రానికి చూస్తున్నాం. ప్రశాంత్ వర్మ మరియు తేజ సజ్జల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. గత ఏడాది విడుదలైన టీజర్ ఈ సినిమా జాతకం ని మార్చేసింది. అప్పుడు మొదలైన ఆ హైప్ ని ప్రమోషనల్ కంటెంట్ తో పెంచుకుంటూ పోయింది మూవీ టీం.
ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్ కి వచ్చిందంటే, ఈ సంక్రాంతి నాలుగు సినిమాలు విడుదల అవుతుంటే, ఆ నాలుగు చిత్రాలను డామినేట్ చేసేంత అన్నమాట. కొన్ని చోట్ల అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ కంటే ఎక్కువ క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది. సోషల్ మీడియా లో అయితే ‘హనుమాన్’ కి ఉన్నంత క్రేజ్ ‘గుంటూరు కారం’ కి లేదనే చెప్పాలి.
అయితే ఎంత కాదు అనుకున్నా మహేష్ బాబు అతి పెద్ద సూపర్ స్టార్, ఆయన సినిమాలకు కచ్చితంగా అత్యధిక థియేటర్స్ కావాలి, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఈ చిత్రానికి దాదాపుగా 140 కోట్ల రూపాయలకు జరిగింది. ఈ చిత్రం విడుదల అవుతున్న రోజే హనుమాన్ విడుదల అవుతుండడం తో ‘హనుమాన్’ కి థియేటర్స్ చాలా తక్కువ దొరికాయి. ఇంత తక్కువ థియేటర్స్ లో విడుదలైతే సినిమా ఎంత బాగున్నప్పటికీ కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అని ట్రేడ్ పండితులు చెప్తుండేవారు. అందుకే ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో, విడుదలకు ముందు రోజు అనగా రేపు సాయంత్రం 6 గంటల నుండి పైడ్ ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యింది.
హైదరాబాద్ లో అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ కి దాదాపుగా 50 లక్షల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి రెండు నుండి మూడు కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక విడుదల రోజు టాక్ వస్తే, కచ్చితంగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు, చూడాలి మరి.