JAISW News Telugu

Hanuman Jayanti : హనుమాన్ జయంతి: వానరులకు ఆత్మీయ విందు

Hanuman Jayanti

Hanuman Jayanti

Hanuman Jayanti : హనుమాన్ జయంతి సందర్భంగా వానరులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుత తరుణంలో ఆహారం దొరకక అంతరించిపోతున్న వానర సంతతిని పరిరక్షించాలనే సదుద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ తెలిపారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మే 31 శుక్రవారం జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వానరులకు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. వానరులకు అరటి, జామ పండ్లు, క్యారెట్, పల్లీలు తదితర ఆహార పదార్థాలను అందజేశారు.

ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా సాహెబ్ నగర్ లోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి కోహెడ గ్రామ పరిధిలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. నీరు, ఆహారం దొరకక చనిపోతున్న మూగజీవాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. భావన శ్రీనివాస్ ను ఆదర్శంగా తీసుకొని వానరులను రక్షించుకోవాలని ఉప్పల శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు.

Exit mobile version