3D Hanuman Sriram : ఫొటోలో హనుమాన్.. అద్దంలో శ్రీరాముడు.. 3డీ పేయింటింగ్ వైరల్..

3D Hanuman Sriram Painting viral

3D Hanuman Sriram Painting viral

3D Hanuman Sriram Painting : జనవరి 22వ తేదీ అయోధ్యలో శ్రీమురాడి ప్రాణప్రతిష్ట జరుగుతుంది. జగదభిరాముడి పట్టాభిషేకం కోసం సమస్త లోకం ఆతృతగా ఎదురు చూస్తోంది. శ్రీరామ తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చక చకా నిర్వహిస్తున్నారు. వైభవోపేతమైన.. దివ్య, భవ్య మందిరాన్ని దర్శించుకునేందుకు వందలాది మంది అయోధ్యకు తరలుపుతున్నారు. ఇప్పటికే అత్తింటి నుంచి కానుకలు, సంభారాలు వచ్చాయి. అన్ని ఏర్పాట్లు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ట్రస్ట్ చర్యలు తీసుకుంటుంది.

ఇవన్నీ పక్కన పెడితే.. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట ఉండడంతో సోషల్ మీడియాతో పాటు మేయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతీ రోజు శ్రీరాముడికి సంబంధించి ఏదో ఒక విషయాన్ని వైరల్ చేస్తూ వస్తుంది. శ్రీ రాముడికి చెందిన పాత చిత్రాలు, రామాయణం సీరియల్ కు చెందిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతూనే ఉన్నాయి. జగదభిరాముడు దేశాన్ని పాలించే సకల గుణాభిరాముడు కొలువు దీరేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టను తిలకించేందుకు లోకం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. శ్రీరామ తీర్థ ట్రస్ట్ కూడా 22వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా లైవ్ టెలీకాస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఇవన్నీ పక్కన పెడితే.. ఇక్కడ ఒక త్రీడీ ఆర్ట్ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హనుమతుడు.. శ్రీరాముడిని విడదీయడం చాలా కష్టం. రాము నామం ఉన్నా చాటు హనుమ అక్కడ వాటిపోతాడు. తన స్వామి సేవలో తరిస్తాడు హనుమ. అలాంటి హనుమ బొమ్మలోనే రాముడి బొమ్మను త్రీడీ పేయింట్ వేశాడో కళాకారుడు. ఈ కళాకారుడు గీసిన కళాఖండం ప్రస్తుతం వైరల్ అవుతుంది. అక్బర్‌ మొమిన్‌ గీసిన పెయింటింగ్‌లో పైకి హనుమాన్‌ చిత్రం కనిపిస్తుండగా, దాని ప్రతిభింబాన్ని అద్దంలో చూసినప్పుడు శ్రీరాముడు దర్శనమిస్తున్నాడు. మొమిన్‌ కళా ప్రతిభను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

TAGS