Hanuman in OTT : ఈ ఏడాది ఆ ఘనత హనుమాన్ మూవీదే.. ఓటీటీలోకి వచ్చేదెప్పుడంటే..
Hanuman in OTT : చిన్న సినిమాగా వచ్చి సంక్రాంతి బరిలో నిలిచి పెద్ద హిట్ గా నిలిచింది హను-మాన్ మూవీ. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్రహీరోలతో పోటీగా థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది. దాదాపు రూ.300 కోట్లు దాక వసూలు చేసి సినీ జనాలను ఔరా అనిపించింది.
తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథనే నమ్ముకుని బరిలో నిలిచింది. హనుమానే ఈ సినిమాకు పెద్ద స్టార్ హీరో. అదే నమ్మకంతో వచ్చి దక్షిణాదినే కాదు ఉత్తరాదిన సత్తా చాటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2024లో బాలీవుడ్ లో 200 కోట్లు వసూలు చేసిన రెండో సినిమాగా నిలిచింది. హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ఫైటర్ మూవీ ఇప్పటికే రూ.350 కోట్లు వసూలు చేయగా, రూ.200 కోట్లతో హనుమాన్ రెండో స్థానంలో నిలువడం గొప్ప విషయమే.
బాలీవుడ్ లో పెద్దగా చిత్రాలు లేకపోవడం కూడా హనుమాన్ కు బాగా కలిసి వచ్చింది. ఫిబ్రవరి చివరి వారం వరకు ఇది కొనసాగితే మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మూవీ టికెట్ ధరను తగ్గించి ఎక్కువ మంది ఆడియన్స్ ను థియేటర్ వైపు నడిపించేలా నిర్ణయం తీసుకుంది మూవీ యూనిట్. సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.150లకే టికెట్ అమ్ముతున్నారు.
ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని జనాలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నీ ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే హనుమాన్ పైనే అందరి ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో జీ 5 అందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 2 నుంచి హనుమాన్ స్ట్రీమింగ్ కు తీసుకొస్తారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. ఈ మూవీ ఓటీటీలోకి వస్తే మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం.