JAISW News Telugu

Hanuman Collections : ‘హనుమాన్’ మొదటి వారం వసూళ్లు..పెట్టిన ప్రతీ పైసాకి 100 రెట్లు లాభాలు!

'Hanuman' first week collections

‘Hanuman’ first week collections

Hanuman Collections : ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న ‘హనుమాన్’ చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జనవరి 12 న విడుదల చేస్తే మీకు థియేటర్స్ రాకుండా చేస్తాం అని బెదిరించి, సాధ్యమైనంత వరకు థియేటర్స్ రాకుండా చేసిన కూడా కంటెంట్ బలంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది.

ఎవరైతే థియేటర్స్ ఇవ్వకుండా చేసారో , చివరికి వాళ్ళే ఇప్పుడు హనుమాన్ చిత్రానికి రెండవ వారం నుండి థియేటర్స్ కేటాయించే పరిస్థితి వచ్చింది. ఇది సాధారమైన విషయం కాదు. కంటెంట్ బలం ఉన్న సినిమాని ఎవ్వరూ అడ్డుకోలేరు అనడానికి ఒక నిదర్శనం గా నిల్చింది ఈ చిత్రం. నిన్న గాక మొన్ననే విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ సినిమా అప్పుడే ఒక వారం రోజుల రన్ ని పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో ప్రాంత వారీగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి విడుదలకు ముందు పాతిక కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విడుదల తర్వాత కేవలం నైజాం ప్రాంతం నుండే 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఒక చిన్న సినిమాకి మొదటి వారం లో ఈ స్థాయి వసూళ్లు రావడం దీనికే జరిగింది. అలాగే రాయలసీమ ప్రాంతం లో 5 కోట్ల 40 లక్షల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో 5 కోట్ల 10 లక్షల రూపాయిలు , తూర్పు గోదావరి జిల్లాలో 3 కోట్ల 70 లక్షల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్ల 30 లక్షల రూపాయిలు రాబట్టింది. ఇక గుంటూరు , కృష్ణ జిల్లాకు కలిపి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, నెల్లూరు జిల్లా నుండి కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

ఓవరాల్ గా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల నుండి 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయిల షేర్ ని కేవలం మొదటి వారం నుండి రాబట్టింది. రెండవ వారం నుండి థియేటర్స్ పెంచారు కాబట్టి, నైజాం ప్రాంతం లో మొదటి వారం కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క హిందీ లో కూడా ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది.

Exit mobile version