HanuMan : ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున విడుదలైన ‘హనుమాన్’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం ఎలాంటిదో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. చిన్న సినిమా, మహేష్ బాబు చిత్రం ముందు నలిగిపోతాది, ఏ ధైర్యం తో ఈ సినిమాని జనవరి 12 న విడుదల చేస్తున్నారు అంటూ ట్రేడ్ పండితులు సైతం హనుమాన్ మూవీ మేకర్స్ పై మండిపడ్డారు. కానీ నేడు వాళ్ళే ఈ సినిమాకి వస్తున్న వసూళ్లను చూసి నోరెళ్లబెట్టారు.
కేవలం మొదటి వారం లోనే ఈ చిత్రానికి 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. కాసేపు ఈ వసూళ్ల సంగతి పక్కన ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విడుదలకు ముందు ఈ సినిమాకి వచ్చిన వసూళ్ళలో తెగిన ప్రతీ టిక్కెట్టుకి 5 రూపాయిలను అయోధ్య రామ మందిరం కి విరాళం గా ప్రకటిస్తానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు అమ్ముడుపోయిన టికెట్స్ మొత్తానికి ప్రతీ టిక్కెట్టుకి 5 రూపాయిలను లెక్క వేస్తే దాదాపుగా రెండు కోట్ల 66 లక్షల రూపాయిలు వచ్చాయట. ఈ డబ్బులు మొత్తం నేడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయోధ్య రామ మందిరం అధికారులకు విరాళం అందించింది మూవీ టీం. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిని చూసిన కొంతమంది నెటిజెన్స్ సినిమా రన్ అయ్యేంత వరకు ఆగొచ్చు కదా, ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఇంకా ఎక్కువ డబ్బులు విరాళంగా ఇచ్చి ఉండొచ్చు, ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని తెలివిగా ఈ పని చేసారా అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే నేటితో ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కొంతమంది మన స్టార్ హీరోలకే లేదు. అలాంటిది అసలు మార్కెట్ లేని తేజ సజ్జల కి వబ్డా కోట్లు రావడం అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అంతే కాదు, ఈ సినిమా స్టార్ హీరోలందరి క్లోసింగ్ కలెక్షన్స్ ని దాటేసి నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.