HanuMan : గత ఏడాది మొత్తం టాలీవుడ్ లో చిన్న సినిమాల హవానే ఎక్కువ నడిచింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ శాతం బోల్తా పడ్డాయి. ఈ ఏడాది కూడా అదే రిపీట్ కాబోతుందా? అని ట్రేడ్ పండితులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే చిన్న హీరో తేజా సజ్జల తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన ‘హనుమాన్’ చిత్రం కి ఉన్న క్రేజ్ మరియు డిమాండ్ చూసి అలా అంటున్నారు. గత ఏడాది టీజర్ తోనే ఈ సినిమా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
తక్కువ బడ్జెట్ తో వందల కోట్ల రూపాయిల క్వాలిటీ ని డైరెక్టర్ చూపించాడు అంటూ ప్రశాంత్ వర్మ ని పొగడ్తలతో ముంచి ఎత్తేసారు. రోజు రోజుకి ఆ సినిమాకి మీద క్రేజ్ పెరుగుతూ పోవడమే తప్ప ఇంచు కూడా తగ్గలేదు. రీసెంట్ గా ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కి, అలాగే లిరికల్ వీడియో సాంగ్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన ‘హనుమాన్’ చిత్రం ‘గుంటూరు కారం’ సినిమాని డామినేట్ చేసేస్తుంది. ఎంత బజ్ ఉంటే మాత్రం, ఏకంగా సూపర్ స్టార్ సినిమాని డామినేట్ చేస్తుందా అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ‘గుంటూరు కారం’ బయ్యర్స్ హనుమాన్ కి థియేటర్స్ రానివ్వకుండా చేస్తున్నారు. దీని గురించి ప్రశ్నించి నిలదీసే ధైర్యం ఎవ్వరికీ లేకుండా పోయింది, ఇలాంటి సమయం లోనే దాసరి విలువ తెలుస్తుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘గుంటూరు కారం’ తో పాటుగా జనవరి 12 వ తేదీన ‘హనుమాన్’ చిత్రాన్ని విడుదల చేస్తుండడం తో గుంటూరు కారం బయ్యర్స్ కి ఈగో హర్ట్ అయ్యిందని, అందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఓవర్సీస్ లో హనుమాన్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు ఉదయం మొదలైంది.
ఆరంభం లోనే ఈ చిత్రానికి 91 షోస్ కి గాను 18 వేల డాలర్స్ వచ్చాయని, కేన్సాస్ స్టేట్ లో కేవలం ఒక్క లొకేషన్ నుండే 73 శాతం కి పైగా ఆక్యుపెన్సీ నమోదు అయ్యిందని, కానీ అదే స్టేట్ లో రెండు లొకేషన్స్ నుండి ‘గుంటూరు కారం’ చిత్రానికి 12 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ‘హనుమాన్’ కి డిమాండ్ మామూలు రేంజ్ లో లేదని, షోస్ పెంచితే గుంటూరు కారం ప్రీమియర్స్ ని దాటేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.