JAISW News Telugu

Prashant Varma Wife : ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భార్యని ఎప్పుడైనా చూసారా..? హీరోయిన్లు కూడా పనికిరారు!

 

Prashant Varma Wife

Prashant Varma Wife

Prashant Varma Wife : ‘హనుమాన్’ చిత్రానికి ముందు ప్రశాంత్ వర్మ ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాలు తెరకెక్కించాడు. ఇవేమి చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ సినిమాలు కావు కాబట్టి ఆయన గురించి ఎవరికీ తెలియలేదు. ఎప్పుడైతే ‘హనుమాన్’ చిత్రం వచ్చిందో అప్పటి నుండి ఇతనికి సంబంధించిన హిస్టరీ మొత్తాన్ని తవ్వేశారు నెటిజెన్స్.

రీసెంట్ గా జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో ప్రశాంత్ వర్మ, తనకి ఇంకా పెళ్లి కాలేదని చాలా మంది అనుకుంటున్నారని, కానీ నాకు పెళ్ళైపోయింది, మా ఆవిడ ఆమెనే అంటూ పరిచయం చేసాడు. చూసేందుకు ఎంతో అందం తో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈమెని చూసి నెటిజెన్స్ ఆశ్చర్యపోయారు. ప్రశాంత్ వర్మ కి ఇంత అందమైన భార్య ఉందా, నమ్మశక్యం గా లేదే అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్. సినిమాల్లోకి రాకముందు ప్రశాంత్ నీల్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మంచి ప్యాకేజి తో జాబ్ చేసేవాడు ఆయన.


అలా ప్రముఖ MNC కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కొనసాగుతూ వచ్చిన ప్రశాంత్ వర్మ, మధ్యలో ఖాళీ సమయం దొరికినప్పుడల్లా యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడు. వాటి ద్వారా పాపులర్ అయిన ప్రశాంత్ వర్మ కి సినిమాల్లో అవకాశం వచ్చింది. అలా మొదలైన ప్రశాంత్ వర్మ కెరీర్ నేడు ఈ స్థాయిలో ఉంది. ఈ హనుమాన్ చిత్రం ఇంత పెద్ద హిట్ అవుతుందని, తనకి ఇంత గొప్ప పేరు వస్తుందని ప్రశాంత్ వర్మ కలలో కూడా ఊహించలేదు. ఒకప్పుడు ఈయనతో సినిమా చెయ్యడానికి మీడియం రేంజ్ హీరోలు కూడా ఆసక్తి చూపే వారు కాదు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ కూడా ప్రశాంత్ వర్మ తో సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.

సక్సెస్ అంటే ఇదే, చిన్న వయస్సు లో ఇంతటి ఉన్నతస్థాయికి చేరుకున్న ప్రశాంత్ వర్మ ని చూసి ప్రతీ ఒక యంగ్ స్టర్ ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో గొప్ప స్థాయికి చేరుకుంటారు. హార్డ్ వర్క్ మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్ ఎలా చెయ్యాలో, ప్రశాంత్ వర్మ ని చూసి నేర్చుకోవాలి. ఈ సినిమాకి ఆయన తక్కువ ఖర్చు తో అద్భుతమైన గ్రాఫిక్స్ ని రాబట్టడమే అందుకు నిదర్శనం. ఆయన నుండి ఇలాంటివి నేర్చుకుంటే కచ్చితంగా గొప్ప రేంజ్ కి వెళ్తారు.

Exit mobile version