Hanuman Director : భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ‘హనుమాన్’ చిత్రం ఏ రేంజ్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకుందో మనమంతా చూసాము. టీజర్ , ట్రైలర్ లో చూపించిన దానికి వంద రెట్లు అద్భుతమైన ఔట్పుట్ ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో ఆడియన్స్ కి చూపించాడు. అయితే పాపం ప్రశాంత్ వర్మ కి ఆ సక్సెస్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చెయ్యడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన గత కొద్దిరోజుల నుండి తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు.
ఈ జ్వరంతోనే ఆయన సినిమా విడుదలకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకొని స్మూత్ రిలీజ్ ఉండేలా చేసాడు. కాసేపటి క్రితమే జ్వరం ఉన్నప్పటికీ కూడా సక్సెస్ మీట్ లో మూవీ టీం తో కలిసి పాల్గొన్నాడు. సక్సెస్ మీట్ పూర్తి అయిన వెంటనే ఆయన హాస్పిటల్ కి వెళ్లి జ్వరానికి కావాల్సిన చికిత్స తీసుకున్నాడట. ఇంత జ్వరం వచ్చినా ఆయన కేవలం ఒక టాబ్లెట్ వేసుకున్నాడే కానీ, డాక్టర్ కి చూపించుకోలేదట.
ఎందుకంటే ఒక్క నిమిషం కూడా సమయం వృధా చెయ్యడం ఆయనకీ ఇష్టం లేకనే అలా చేసాడట. సినిమా విడుదలకు ముందు ఆయన డబ్బింగ్ స్టూడియో లో హీరో చేత కొన్ని టేకులు చేయించాడట. జ్వరం లో కూడా ఇంత కష్టపడి పని చేసినందుకు ప్రశాంత్ వర్మ కి రావాల్సిన ఫలితం అయితే వచ్చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా పాతిక కోట్ల రూపాయలకు జరిగింది. ఈ పాతిక కోట్ల రూపాయిల టార్గెట్ ని ఈ చిత్రం కేవలం రెండవ రోజే అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొదటి రోజు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, రెండవ రోజు అంతకంటే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఎందుకంటే ప్రతీ సెంటర్ లో ఈ సినిమాకి ఇప్పుడు థియేటర్స్ దొరుకుతున్నాయి. సంక్రాంతి పండుగ నాడు సినిమాలకు మంచి వసూళ్లను తెచ్చిపెట్టే ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలలో అనేక థియేటర్స్ లో ‘గుంటూరు కారం’ చిత్రాన్ని తీసేసి హనుమాన్ ని ప్రదర్శిస్తున్నారట. కాబట్టి రెండవ రోజు పది కోట్ల రూపాయిల షేర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. రోజు రోజుకి పెరుగుతూ పోతున్న ఈ వసూళ్ల సునామి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో, ఏ తీరం వరకు చేరుతుందో చూడాలి.