JAISW News Telugu

Hanuman : గంటకి 30 వేల టిక్కెట్లు..మొదటిరోజే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసిన ‘హనుమాన్’!

Hanuman

Hanuman

Hanuman Break Even : భారీ అంచనాల నడుమ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ‘హనుమాన్’ చిత్రానికి ఏ రేంజ్ పాజిటివ్ టాక్ వచ్చిందో మనమంతా చూసాము. ఇటీవల కాలం లో ఇలాంటి థియేట్రికల్ అనుభూతిని ఇచ్చిన సినిమాని చూడలేదు, ఇది కదా మన తెలుగోడి ప్రతిభ అని ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో పొగడ్తలతో ముంచి ఎత్తారు. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా అదిరిపోయాయి.

బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో ఉన్న గణాంకాల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు దాదాపుగా నాలుగు లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా విడుదల రోజే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం విడుదలైంది. అంత పెద్ద సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు క్లాష్ అవసరమా?, హనుమాన్ ని వాయిదా వేసుకుంటే బెటర్ అని ఇండస్ట్రీ లో పెద్దలు నిర్మాతలను రిక్వెస్ట్ చేసారు, వాళ్ళు వినకపోయేసరికి బెదిరించారు కూడా, అయినా ఆ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి వెనకడుగు వెయ్యలేదు.

తమ మాట లెక్క చెయ్యలేదని ‘హనుమాన్’ సినిమాకి థియేటర్స్ దొరక్కుండా చేసారు, అయినా తమ కంటెంట్ మీద ధైర్యం తో ముందుకు వచ్చారు. ఇప్పుడు ‘హనుమాన్’ కొడుతున్న రికార్డ్స్ కి ‘గుంటూరు కారం’ థియేటర్స్ ని పీకేసి , హనుమాన్ కి కేటాయిస్తున్నారు. ఇది కదా అసలు సిసలు విజయం అంటే. అలా ప్రతీ చోట కళ్ళు చెదిరే ఆక్యుపెన్సీ ని దక్కించుకున్న హనుమాన్ చిత్రానికి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లను తీసుకుంటే ఈ సినిమాకి 13 కోట్ల 77 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 25 కోట్ల రూపాయిలు మాత్రమే.

ఈరోజు థియేటర్స్ సంఖ్య బాగా పెరిగింది కాబట్టి, మొదటి రోజు కంటే ఎక్కువ షేర్ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవర్సీస్ లో అయితే మొదటి రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునేసింది. అంతే కాదు ప్రతీ లొకేషన్ లోను గుంటూరు కారం గ్రాస్ వసూళ్లు డబుల్ మార్జిన్ తో దాటి సంచలనం సృష్టించింది ‘హనుమాన్’ చిత్రం. వసూళ్ల జోరు చూస్తూ ఉంటే కచ్చితంగా ఈ చిత్రం క్లోసింగ్ లో 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాదిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Exit mobile version